- Telugu News Photo Gallery Sports photos Meet Pakistani sports anchor Zainab Abbas who is a big fan of Indian fast bowler Mohammed Siraj
Zainab Abbas: సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్ అబ్బాస్.. ఏం జరుగుతోంది..?
టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు సూపర్ ఫామ్‌తో దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు తన ఆటతీరు మెరుగుపరుచుకుంటున్న ఈ యువ పేసర్.. ఫ్యాన్స్ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నాడు.
Updated on: Aug 27, 2021 | 11:26 AM

అయితే ఇతగాడికి ఇండియాలోనే కాదు.. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ అభిమానులున్నారండోయ్. అవును.. పాకిస్థాన్ స్పోర్ట్స్ యాంకర్, జర్నలిస్టు జైనాబ్ అబ్బాస్‌కు సిరాజ్ అంటే చెప్పలేనంత అభిమానం. ఈ విషయాన్ని ఆమే ఎన్నోసార్లు బాహాటంగా వ్యక్తపరిచింది.

జైనాబ్ అబ్బాస్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించింది. ఆమె వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. జైనాబ్ తండ్రి నసీర్ ఓ క్రికెటర్. పాకిస్థాన్ దేశవాళీ టోర్నీల్లో ఆడాడు. జైనాబ్ అబ్బాస్ ఇంగ్లాండ్‌లోని వార్విక్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎమ్బీఏ పూర్తి చేసింది.

సిరాజ్ ఓ వరల్డ్ క్లాస్ ఫాస్ట్‌బౌలర్ అని ప్రశంసలు కురిపించింది. ఇటీవల కాలంలో అతడు నమోదు చేస్తున్న గణాంకాలు అద్భుతం అని జైనాబ్ అబ్బాస్ ప్రశంసించింది. ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అతడి ప్రతిభ కనపడుతుందని పేర్కొంది.

జైనాబ్ అబ్బాస్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న ది హండ్రెడ్ లీగ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ ఉన్నారు.

కాగా సిరాజ్‌తో పాటు జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలు ఇండియా టీమ్ విదేశాలలో మ్యాచ్‌లు గెలవడంలో కీలక భూమిక పోషిస్తున్నారని జైనాబ్ అబ్బాస్ అభిప్రాయపడింది.




