AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: షూటింగ్‌ విరామంలో రాశీ ఖన్నా ఏం చేస్తుందో చూశారా.? దాని గురించే ఆలోచన..

Rashi Khanna: హిందీలో 'మద్రాస్‌ కేఫ్‌' అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ అనంతరం రెండో సినిమా 'మనం'తో...

Rashi Khanna: షూటింగ్‌ విరామంలో రాశీ ఖన్నా ఏం చేస్తుందో చూశారా.? దాని గురించే ఆలోచన..
Rashi Khanna
Narender Vaitla
|

Updated on: Aug 27, 2021 | 11:35 AM

Share

Rashi Khanna: హిందీలో ‘మద్రాస్‌ కేఫ్‌’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ అనంతరం రెండో సినిమా ‘మనం’తో తెలుగులో అడుగుపెట్టింది. ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించినప్పటికీ తన అందంతో ఆకట్టుకుందీ చిన్నది. ఇక అనంతరం వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ, విజయాలను అందుకుంటూ దూసుకుపోతోందీ అందాల తార. ‘ఊహలు గుసగుసలాడే’తో మొదలైన ఈ అమ్మడి ప్రస్థానం ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ కొనసాగుతోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇటీవల హిందీలో తెరకెక్కుతోన్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ.

ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ జోష్‌ మీదున్న రాశీఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్‌’ అనే సినిమాలో రాశీ ఖన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రీకరణలో పాల్గొన్న రాశీ ఖన్నా షూటింగ్‌ స్పాట్‌లోని ఫొటోను అభిమానులతో పంచుకుంది. కుర్చిపైనే కునుకు తీస్తోన్న సమయంలో తీసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘షూటింగ్‌ గ్యాప్‌ల మధ్యలో ఇలా నిద్రపోతుంటాను. నిద్రలో వెకేషన్‌ గురించి కలలు కంటుంటాను’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటీ.

రాశీ ఖన్నా పోస్ట్..

Also Read: Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఈ కోణాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు

Pawan Kalyan: ముగిసిన ‘అన్నయ్య’ పుట్టిన రోజు వేడుకలు.. మొదలైన ‘తమ్ముడు’ బర్త్ డే సెలబ్రేషన్స్..

Zainab Abbas: సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్​ అబ్బాస్​.. ఏం జరుగుతోంది..?

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?