Pawan Kalyan: ముగిసిన ‘అన్నయ్య’ పుట్టిన రోజు వేడుకలు.. మొదలైన ‘తమ్ముడు’ బర్త్ డే సెలబ్రేషన్స్..

Pawan Kalyan Birthday Celebrations Begins: అన్నయ్య పుట్టిన రోజు వేడుకలు అయ్యాయి.. ఇక తమ్ముడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అవును మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ ను తెలుగు రాష్ట్రాల్లోని..

Pawan Kalyan: ముగిసిన 'అన్నయ్య' పుట్టిన రోజు వేడుకలు.. మొదలైన 'తమ్ముడు' బర్త్ డే సెలబ్రేషన్స్..
Pawan Kalyan
Follow us

|

Updated on: Aug 27, 2021 | 11:33 AM

Pawan Kalyan Birthday Celebrations Begins: అన్నయ్య పుట్టిన రోజు వేడుకలు అయ్యాయి.. ఇక తమ్ముడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అవును మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ ను తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఘనంగా చేశారు. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి.. అనేకమందికి అండగా నిలిచారు. ఇక సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అన్నయ్య చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తమదైన శైలిలో తెలియజేశారు. ఇప్పుడు తమ్ముడు జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన 50 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా ఇక బుల్లి తెరపై కూడా పలు షోలు తమదైన శైలిలో స్కిట్స్‌తో  పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి.

తాజాగా ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ రియాల్టీ షో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్​కు బర్త్‌డే స్పెషల్‌ విషెస్‌ తెలిపింది. ఈ మేరకు ప్రోమో విడుదలైంది. లేడీస్‌ కిట్టి పార్టీ పేరుతో వచ్చే ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజున సినీ, బుల్లితెర నటులు తమదైన శైలి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పవర్‌స్టార్‌ నటించిన సినిమాల్లోని పాటలకు స్టేజ్‌పై హుషారెత్తించేలా డ్యాన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో నటి హేమతోపాటు ఇంద్రజ కూడా పాల్గొని సందడి చేశారు. ‘అమ్మా.. నాన్నా.. పవన్‌ కళ్యాణ్ ఎప్పుడూ మన హృదయంలోనే ఉండిపోతారు’ అంటూ ఇంద్రజ.. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రతివారం పలు నటీనటులు సందడి చేస్తోన్న ఈ షోలో ఈసారి నటి ఇంద్రజ, హేమ , యూట్యూబ్‌ స్టార్‌ సునైనా పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 2న జరగనున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకుని స్పెషల్‌ విషెస్‌ తెలిపారు.

Also Read: Tirupati: తిరుమలలో మహేంద్ర కొత్త వాహనానికి ప్రత్యేక పూజ.. శ్రీవారికి ఆ జీప్‌ని కానుకగా ఇచ్చిన సంస్థ