Corona Virus: దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. వరసగా ఆ రాష్ట్రంనుంచే భారీగా కొత్తకేసులు నమోదు

India Corona Virus: మనదేశంలో సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది అనుకొనే సమయంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కరోనా కొత్త కేసుల నమోదు తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ గత రెండు రోజుల నుంచి పెరుగుతున్నాయి..

Corona Virus: దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. వరసగా ఆ రాష్ట్రంనుంచే భారీగా కొత్తకేసులు నమోదు
India Corona
Follow us

|

Updated on: Aug 27, 2021 | 11:28 AM

India Corona Virus: మనదేశంలో సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది అనుకొనే సమయంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కరోనా కొత్త కేసుల నమోదు తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ గత రెండు రోజుల నుంచి పెరుగుతున్నాయి. వరసగా రెండో రోజు దేశంలో 40వేలకు పైగా కోవిడ్ కొత్తకేసులు నమోదయ్యాయి. తాజాగా కొత్తగా 44,658 మంది వైరస్ బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య సంస్థ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. కేరళలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి… దీంతో దేశ వ్యాప్తంగా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. అయితే నిన్నటితో పోలిస్తే.. ఈరోజు కొంతమేర కేసులు తక్కువగా నమోదయ్యాయి.

గురువారం దేశవ్యాప్తంగా 18,24,931 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 51.49 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 44,658 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 32,988 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 3,18,21,428 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఒక్కరోజులోనే 496 మంది మరణించారు. దీంతో దేశంలోని మరణాల సంఖ్య 4,36,861లకు చేరుకుంది. ప్రస్తుతం మనదేశంలో 3,44,899 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

మరోవైపు కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న కేరళలో 30,077 మందికి కరోనా నిర్ధారణ అయింది. 162 మంది మరణించారు ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం మరో 79,48,439 కొవిడ్​ టీకా డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 61,22,08,542 టీకా డోసులను పంపిణీ చేసిశామని తెలిపింది.

Also Read: Pawan Kalyan: ముగిసిన ‘అన్నయ్య’ పుట్టిన రోజు వేడుకలు.. మొదలైన ‘తమ్ముడు’ బర్త్ డే సెలబ్రేషన్స్..