విదేశాలకు వెళ్లే వారు కోవిడ్‌-19 సర్టిఫికేట్‌తో పాస్‌పోర్టును లింక్‌ చేసుకున్నారా..? అయితే ఇలా చేయండి..!

Covid-19 vaccine certificate Link: ప్రస్తుతం దేశంలోని ప్రాణాంతక కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి..

విదేశాలకు వెళ్లే వారు కోవిడ్‌-19 సర్టిఫికేట్‌తో పాస్‌పోర్టును లింక్‌ చేసుకున్నారా..? అయితే ఇలా చేయండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 27, 2021 | 6:09 PM

Covid-19 vaccine certificate Link: ప్రస్తుతం దేశంలోని ప్రాణాంతక కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదికిపైగా అతలాకుతలం చేసిన కరోనా.. ప్రస్తుతం కట్టడిలోకి వచ్చింది. ఇదివరకు సెకెండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో విమానయాన సంబంధాలను తెంచుకున్న దేశాలన్నీ ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకునే పనిలో పడ్డాయి. జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు విమాన సర్వీసులను ప్రారంభించాయి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే విమాన ప్రయాణానికి వీలు కల్పిస్తోన్నాయి. అంతేకాదు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌తో లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి.

ఇక విదేశాలకు వెళ్లేవారి పాస్‌పోర్టులను వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌తో లింక్ చేయడానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కోవిన్ (CoWIN) పోర్టల్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు, ఉద్యోగస్తులు సహా.. క్రీడాకారులు కూడా తమ పాస్‌పోర్టులతో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇంట్లోనే ఉండి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

కోవిడ్‌ సర్టిఫికేట్‌తో పాస్‌ పోర్టు లింక్‌ చేయడం ఎలా..?

విదేశాలకు వెళ్లదలిచిన తొలి డోసు తీసుకున్న వారికి రెండో డోసులో ప్రాధాన్యతను ఇస్తోంది. విదేశాలకు వెళ్లాలనుకున్న వాళ్లు తమ పాస్‌పోర్టును కోవిన్ పోర్టల్ ద్వారా లింక్ చేసుకోవాలనుకుంటే ముందుగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు తెలియజేసే వివరాలతో కూడిన హోమ్ స్క్రీన్ ప్రత్యక్షమౌతుంది. అక్కడే రెయిజ్ యాన్ ఇష్యూ (Raise an Issue) అనే బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.

దాన్ని క్లిక్ చేసిన వెంటనే యాడ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ (Add Passport details) అనేవి కనిపిస్తాయి. అందులో సూచించిన వివరాల ప్రకారం.. వివరాలు నమోదు చేయాలి. తాము ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకున్నామనే విషయాన్ని కూడా అక్కడ నమోదు చేయడం తప్పనిసరి. కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ టీకా వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి. పొరపాటున అక్షరదోషాలు ఏవైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే వీలు కూడా ఉంది. అయితే ఏదైనా మార్పులు ఉంటే ఒక్కసారి మాత్రమే చేసుకోవచ్చు. లింక్‌ చేసే ముందు వివరాలన్ని సరి చెక్‌ చేసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Act Fibernet: యాక్ట్‌ ఇంటర్నెట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్‌..!

Black Holes: అంతరిక్షంలో తొలిసారి.. మూడు భారీ బ్లాక్‌హోల్స్‌ విలీనం.. వింతను ఆవిష్కరించిన భారత శాస్త్రవేత్తలు!