AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Job Mela: ఏపీలో జాబ్ మేళా.. భారీగా ఉద్యోగానియామకాలు, టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. వివరాల్లోకి వెళ్తే..

AP Job Mela: ఆంధ్రపదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు సంస్థల్లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీసీఎల్, రైసింగ్ స్టార్స్, హీరో మోటార్ గ్రూప్స్,.

AP Job Mela: ఏపీలో జాబ్ మేళా.. భారీగా ఉద్యోగానియామకాలు, టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. వివరాల్లోకి వెళ్తే..
Ap Job Mela
Surya Kala
|

Updated on: Aug 27, 2021 | 9:34 AM

Share

AP Job Mela: ఆంధ్రపదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు సంస్థల్లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీసీఎల్, రైసింగ్ స్టార్స్, హీరో మోటార్ గ్రూప్స్, టెక్ టీమ్ సొల్యూషన్స్, వీల్స్ మార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఈ మేరకు అర్జులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇప్పటికే ప్రకటన రిలీజయింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉద్యోగ వివరాలు: TCL -100 Raising Stars -100 Hero Moto Corp -100 Teck Team -5 Wheels Mart -90

విద్యార్హత వయసు తదితర వివరాలు:

టిసిఎల్ లో అసెంబ్లీ/రీ వర్క్/టెస్టింగ్ సెక్షన్ లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన అర్హులు. వయస్సు 19-30 మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12, 014 జీతం.. ఉచితంగా భోజనం, వసతి, రవాణ సదుపాయం కల్పించనున్నారు. .

రైజింగ్ స్టార్: ఈ సంస్థలో అసెంబ్లిగ్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. వయస్సు 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10, 200 వరకు వేతనం చెల్లించనున్నారు. ఉచిత భోజనం, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.\

Hero Moto Corp: ఈ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ(పురుషులు), ఇంటర్(స్త్రీలు) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 14,977 వేతనం.. వీరు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.

Teck Team : ఈ సంస్థ టెక్నికల్ ట్రైనర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు డిప్లొమా/బీటెక్ ఈసీఈ(ఫ్రెషర్స్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వయస్సు 26 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు వేతనం ఉంటుంది. విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.

Wheels Mart: ఈ సంస్థలో సేల్స్, కలెక్షన్, ఎగ్జిక్యూటీవ్స్, అకౌంటెంట్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ ఉట్టెర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 నుంచి 30 ఏళ్ల మధ్య లో ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవచ్చు.. https://apssdc.in/home/

ఉద్యోగాలకు ఆగష్టు 31న ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ జరిగే వేదిక: ఆర్.కే జూనియర్ కాలేజీ&డిగ్రీ కాలేజీ ఆర్.కే ప్యాలస్ మయూరీ జంక్షన్ విజయనగరం జిల్లా మరిన్ని వివరాల కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్లు: 7989826953, 9000102013

Also Read: Childhood-Rare Photo: అమ్మ ఒడిలో ఉన్న ఈ హైదరాబాదీ చిన్నారి.. జాతీయ ఉత్తమ నటి.. ఎవరో గుర్తుపట్టారా..