Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood-Rare Photo: అమ్మ ఒడిలో ఉన్న ఈ హైదరాబాదీ చిన్నారి.. జాతీయ ఉత్తమ నటి.. ఎవరో గుర్తుపట్టారా..

Childhood-Rare Photo: ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. అమ్మ ఒడిలో కూర్చున్న ఈ బుజ్జాయి.. అద్భుతనటనతో .. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పలు అవార్డ్స్ పొందిన హీరోయిన్.. అవును ఆపాత మధురం చిన్ననాటి ఫోటోలు..

Childhood-Rare Photo: అమ్మ ఒడిలో ఉన్న ఈ హైదరాబాదీ చిన్నారి.. జాతీయ ఉత్తమ నటి.. ఎవరో గుర్తుపట్టారా..
Childhood Photo
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2021 | 8:56 AM

Childhood-Rare Photo: ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. అమ్మ ఒడిలో కూర్చున్న ఈ బుజ్జాయి.. అద్భుతనటనతో .. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పలు అవార్డ్స్ పొందిన హీరోయిన్.. అవును ఆపాత మధురం చిన్ననాటి ఫోటోలు.. అవి చూసుకుంటుంటే ఎవరికైనా ..కల్మషం లేని అందమైన బాల్యం మన కనుల ముందు దర్శనమిస్తుంది. అదే సినీ నటీనటులకైతే.. తమ బాల్యాన్ని గుర్తు చేసేవి ఫోటోలు మాత్రమే కాదు.. వారు చిన్నతనంలో నటించిన సినిమాలు కూడా.. శ్రీదేవి, మీనా, రాశి వంటి వారు చిన్నతనంలో బాలనటులుగా నటించి అనంతరం హీరోయిన్ గా వెండి తెరపై అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్స్ గా తమకంటూ ఓ సినీ పరిశ్రమలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి బాటలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. చిన్నతనంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి.. కాలక్రమంలో హీరోయిన్ గా ఎదిగినవారున్నారు. అటువంటి హీరోయిన్ లో ఒకరు టబు..

హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థిరపడిన నటి టబు అలియాస్ తబుస్సుమ్ హష్మి.. నటి ఫరాహ్ చెల్లెలు. దివ్యభారతి, టబులు మంచి స్నేహితులు. దీంతో దివ్యభారతి రాఘవేంద్రరావుకు పరిచయం చేసింది. అప్పుడు రాఘవేంద్రరావు దర్శత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కూలీ నెంబర్ నెంబర్ 1 సినిమాతో వెండి తెరకు స్వాతిగా పరిచయం అయింది.

1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మి, తల్లి రిజ్వానా. తల్లి ఒక టీచర్. టబు చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. దీంతో టబు బాల్యం అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే గడిచింది. హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకుంది టబు.. అక్కడ టబు బాలనటిగా 1980లో ‘బజార్’ అనే చిత్రంలో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 14 ఏళ్ల వయసులో ‘హమ్ నే జవాన్’ లో దేవానంద్‌కి కూతురిగా నటించింది.

హీరోయిన్ గా బోణీకపూర్ నిర్మించిన ‘రూప్‌కీ రాణీ చోరోంకా రాజా’, ‘ప్రేమ్’ చిత్రాల కోసం ఎంపికైంది. అయితే సంజయ్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమ్’ పూర్తి కావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది. ఇంతలో తెలుగులో రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఇక బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో విజయ్ పథ్ లో హీరోయిన్ గా నటించి బాలీవుడ్ లో మొదటి హిట్ ను అందుకుంది. తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో కెరీర్ సూపర్ ఫాస్ట్ అయ్యింది. ‘సాజన్ చలే ససురాల్’, ‘జీత్’ చిత్రాలు టబుని స్టార్ హీరోయిన్ చేశాయి. 90వ దశకంలో టబు చలన చిత్ర పరిశ్రమను ఏలింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. హిందీలో చేసిన ‘మాచీస్’ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. కాలాపానీ , చాందినీ బార్ వంటి సినిమాల్లో టబు నటనతో ఆమెని మరో స్టేజ్ కు తీసుకుని వెళ్లాయి. ఇక తెలుగులో నిన్నే పెళ్లాడతా, ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి వంటి సినిమాలో హీరోయిన్ గా నటించింది. తమిళంలో నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ‘ప్రేమదేశం’గా విడుదలై ఘనవిజయం అందుకొంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అలవైకుంఠ పురం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ.. కెరీర్ ను సక్సెస్ గా కొనసాగుతుంది టబు.

Tabu

Tabu

కథానాయికగా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా, టబు అనగానే తెలుగు ప్రేక్షకులు ‘మా కథానాయికే’ అంటుంటారు. ‘కూలీ నెంబర్ 1’ తర్వాత చాలా రోజులకి ‘నిన్నే పెళ్లాడతా’లో నటించింది. సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ‘ప్రేమదేశం’గా విడుదలై ఘనవిజయం అందుకొంది. టబు ఆచితూచి కథల్ని ఎంచుకొంటుంది. మనసుకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తుందని ఫిల్మ్ నగర్ లో టాక్ .

Also Read: Moral Stories for Kids: ప్రేమతో, దయతో మన తలరాతని ఎలా మనం మార్చుకోవచ్చు తెలియజెప్పే కథ..