మా దేశ పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఆఫ్ఘానిస్తాన్ నుంచి తప్పించుకున్న పాప్ సింగర్ ఆవేదన..

తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘానిస్తాన్‏లో పరిస్థితులు దయనీయంగా మారాయి. తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకునేందుకు

మా దేశ పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఆఫ్ఘానిస్తాన్ నుంచి తప్పించుకున్న పాప్ సింగర్ ఆవేదన..
Afghanistan Pop Singer Arya
Follow us

|

Updated on: Aug 27, 2021 | 9:54 PM

తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘానిస్తాన్‏లో పరిస్థితులు దయనీయంగా మారాయి. తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం విడిచిపోవాలని అక్కడి పౌరులు సరిహద్దు దేశాలకు పారిపోతున్నారు. ఇక కాబూల్ విమానాశ్రయంలో ఆఫ్ఘాన్ ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాలిబన్ల పాలనలో మేము ఉండలేమని… ఎలాగైనా దేశం విడిచి పారిపోయేందుకు విమానాశ్రయంలో తిండి, నీరు లేకుండా ఎదురుచూస్తున్నారు. ఇక కాబూల్ వెళ్లిన విమానాలు అత్యంత రద్దీగా మారడంతో.. వాటి రెక్కలపై, చక్రాల దగ్గర కూర్చుని ఇతర దేశాలను వెళ్లిపోతున్నారు ఆఫ్ఘాన్ పౌరులు. ఈ క్రమంలో విమానం నుంచి జారిపడి ప్రాణాలు పొగోట్టున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని దిగ్ర్బాంతికి గురిచేశాయి. ఇటీవల ఆఫ్ఘాన్ నుంచి చాకచాక్యంగా అక్కడి పాప్ సింగర్ ఆర్యానా సయిద్ పారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆఫ్ఘాన్ పరిస్థితులు హృదయవిదారకంగా ఉందని.. ప్రపంచం మొత్తం ఆప్ఘానిస్తాన్ పరిస్థితులను చూసి నిరాశచెందుతుందని తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. ఆఫ్ఘానిస్తాన్ ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయింది. మా దేశ పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. లక్షలాది మంది అమాయక ప్రజలు ఆఫ్ఘానిస్తాన్ దేశంలోనే ఉండిపోయారు. వారిని తలచుకుంటే బాధగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆర్యానా సాయిద్ అమెరికా సైనిక విమానంలో కాబూల్ నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉంది. ఆర్యానా సయిద్ కాబూల్ విమానాశ్రయంలోని పరిస్థితులను వివరిస్తూ.. నేను కాబూల్ నుంచి బయలుదేరిన రోజు .. తాలిబన్లు అక్కడికి వచ్చారు. వేలాది మంది విమానాశ్రయానికి రావడం చాలా భయంకరంగా అనిపించింది. అక్కడ పూర్తిగా గందరగోళంగా మారింది. నేను విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఒక మహిళ తన బిడ్డకు నాకు అప్పచెప్పింది. తను ఏడుస్తూ.. తన బిడ్డను నాతు తీసుకెళ్లమని ప్రాధేయపడింది. కానీ తల్లి నుంచి బిడ్డను ఎలా వేరుచేయాలో నాకు అర్థం కాలేదు. వెంటనే అక్కడే ఉన్న సైనికుడిని బిడ్డతోపాటు తల్లిని కూడా మాతో తీసుకెళ్ళవచ్చా అని అడిగాను. కానీ సైనికులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె బిడ్డను తిరిగి ఆమెకు ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచం మేల్కొని ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను … మహిళలు (మునుపటి తాలిబాన్ పాలనలో) మాదిరిగా తలపై కాల్చుకోరని నేను ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. భారతదేశం ఆప్ఘానిస్తాన్ స్నేహితుడని.. భారతదేశంకు పాకిస్తాన్ పూర్తిగా వ్యతిరేకం. పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ శాంతి, సామార్యం, సహాయం చేయడానికి భారత్ ప్రయత్నిస్తుంది. తమ ప్రజలను భారత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మిలియన్స్ మందికి సాయం చేయాలని ప్రపంచాన్ని నేను కోరుకుంటున్నాను. నా ప్రజల కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉంటాను అని ఆర్యానా సయిద్ అన్నారు.

Also Read: Karuna Kumar: సినిమా కంప్లీట్.. నెక్ట్స్ మెగా వెబ్ సిరీస్.. పలాస డైరెక్టర్ భారీ ప్రయోగం.. !

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.