Afghanistan Crisis: అమెరికా పవర్ కౌంటర్.. అఫ్గా‌న్‌లోని ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై వైమానిక దాడి

కాబుల్​లో ఐసిస్​-కే జరిపిన జంట ఆత్మాహుతి పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాణాన్ని అగ్రదేశం చాలా సీరియస్‌గా...

Afghanistan Crisis: అమెరికా పవర్ కౌంటర్.. అఫ్గా‌న్‌లోని ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై వైమానిక దాడి
America Airstrike
Follow us

|

Updated on: Aug 28, 2021 | 8:14 AM

కాబుల్​లో ఐసిస్​-కే జరిపిన జంట ఆత్మాహుతి పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాణాన్ని అగ్రదేశం చాలా సీరియస్‌గా తీసుకుంది. 48 గంటల గడవకుండానే ప్రతీకారం దిశగా అడుగులు వేసింది. అఫ్గానిస్థాన్ ​నంగహర్‌లో ఐసిస్ సభ్యునిపై మానవరహిత వైమానిక దాడి చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్​ హెచ్చరికలు జారీ చేసిన తదుపరి రోజే ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ దాడిలో ఒక ఐసిస్ సభ్యుడు మరణించాడని, పౌర ప్రాణనష్టం గురించి తమకు తెలియదని నేవీ కెప్టెన్ విలియం అర్బన్ చెప్పారు.  కాబూల్ విమానాశ్రయం ద్వారాల వెలుపల గురువారం జరిగిన ఆత్మాహుతి పేలుళ్లకు ఆ వ్యక్తి ప్రత్యేకంగా సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. కాగా కాబుల్​ ఎయిర్‌పోర్ట్ వద్ద గురువారం జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 180మందికిపైగా మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ వదిలిపెట్టమని.. వెంటాడి చంపుతామని బైడెన్​ హెచ్చరించారు. కాగా కాబూల్‌లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. ‘ముప్పు కొనసాగుతోంది. మా దళాలు ఇంకా ప్రమాదంలో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.  కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది.

మరోవైపు కాబూల్‌లో వరుస పేలుళ్ల తర్వాత సోదాలు ముమ్మరం చేశారు తాలిబన్లు. ఐసిస్‌ కే అనుమానితుల కోసం ఇంటింటిని గాలిస్తున్నారు. 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ ఈస్ట్ గేటు దగ్గర జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. కాబూల్‌లో వరుస పేలుళ్లతో భయాందోళన చెందుతున్నారు ఆఫ్ఘన్‌ వాసులు. ఇప్పటివరకు లక్షా 11 వేల మంది ఆఫ్ఘన్‌లను బయటకు తరలించింది అమెరికా. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌పై మరిన్ని దాడులు జరగొచ్చని హెచ్చరించింది. తమ పౌరుల తరలింపును మరింత వేగవంతం చేసింది.

Also Read: బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ.. ఫోటో తీసిందెవరో చెప్పాలంట..

ఒక్క రోజే రికార్డు స్థాయి వ్యాక్సినేషన్.. అభినందనలు తెలిపిన మోడీ