Vaccination : ఒక్క రోజే రికార్డు స్థాయి వ్యాక్సినేషన్.. అభినందనలు తెలిపిన మోడీ
కరోనా కల్లోలంతో దేశం అల్లకల్లోలం అయినా విషయం తెల్సిందే. కరోనా కారణంగా లక్షమందికి పైగా మృత్యువాత పడ్డారు.
Vaccination : కరోనా కల్లోలంతో దేశం అల్లకల్లోలం అయిన విషయం తెల్సిందే. కరోనా కారణంగా లక్షమందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే వేలది మంది ఆసుపత్రుల పాలు అయ్యారు. ఇక కరోనా కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లాక్ డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. మొదటి వేవ్ సమయంలో ఎక్కువ మంది కరోనాకు బలైపోయారు అనుకుంటే ఆ తర్వాత వచ్చిన సెకండ్ వేవ్‌లో అంతకు మించి ప్రజలు మరణించారు. ఇక కరోనాను కట్టడి చేసేందుకు మనదగ్గర ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. తాజాగా ఒక్కరోజే (ఆగస్టు 27) దేశంలో కోటి మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా వేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు మొత్తం 62,17,06882 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో 48,08,78,410 మంది మొదటి డోస్‌ను వేయించుకున్నారు. అలాగే 10,08,28,472 మంది సెకండ్ డోస్ వేయించుకున్నారు. కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ తప్పని సరి. అలాగే సెలబ్రెటీలు కూడా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కలిపిస్తున్నారు. తాజాగా ఒక్క రోజే కోటి మంది వ్యాక్సిన్ వేయించుకోవడం పై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.. ఒక్కరోజే రికార్డు స్థాయిలో కోటిమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకాలు వేసిన వారికి మరియు టీకాను విజయవంతం చేసిన వారికి అభినందనలు అని మోడీ ట్వీట్ చేశారు.
Record vaccination numbers today!
Crossing 1 crore is a momentous feat. Kudos to those getting vaccinated and those making the vaccination drive a success.
— Narendra Modi (@narendramodi) August 27, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :