Director RGV: బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ.. ఫోటో తీసిందెవరో చెప్పాలంట..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Aug 27, 2021 | 11:44 PM

టాలీవుడ్ దర్శకుల్లో ఏ దర్శకుడికి లేనంత క్రేజ్ ఆర్జీవీకి సొంతం.. ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా జనల నోళ్ళల్లో నానుతుంటారు.

Director RGV: బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ.. ఫోటో తీసిందెవరో చెప్పాలంట..
Rgv

Director RGV: టాలీవుడ్ దర్శకుల్లో ఏ దర్శకుడికి లేనంత క్రేజ్ ఆర్జీవీకి సొంతం.. ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా జనల నోళ్ళల్లో నానుతుంటారు. నిజానికి ఆర్జీవీ ఎక్కడుంటే వివాదం అక్కడుంటుంది. చిన్న విషయమైన ఆర్జీవీ దాన్ని సంచలనం చేస్తారు. ఇప్పటికే పలు వివాదస్పద సినిమాలతో హాట్ టైపిక్ అయిన వర్మ. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక ట్విటర్‌లో ఆర్జీవీ ట్వీట్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ట్విటర్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి. అలాగే ఈ ఫోటో తీసింది ఎవరో కూడా చెప్పండి అంటూ నెటిజన్లకు ప్రశ్నలు సంధించారు వర్మ. ఆ ఫొటోలో ఉంది ఎవరో కాదు అందాల యాంకర్ అషూ రెడ్డి. అయితే వర్మను ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది లేడీ యాంకర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన అరియనా.. నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారారు. తాజాగా మరో బిగ్‏బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళింది.

ఆ సమయంలో ఆర్జీవీ తన క్రియేటివిటీని చూపించారు. తనలో ఉన్న ఫోటోగ్రాఫర్ ను బయటపెట్టారు వర్మ. లో యాంగిల్‌‌‌‌లో ఆమె థైస్ కనిపించేలా ఫోటో తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ మధ్య అషూ రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇప్పుడు వర్మ ఆ ఫోటోను షేర్ చేశారు. బ్లూ కలర్ స్కట్ వేసుకున్న అషూ రెడ్డి తన థైస్ ఎలివేట్ అయ్యేలా ఫోజ్ ఇస్తే వర్మ తనదైన స్టైల్‌లో క్లిక్ మనిపించారు.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..

Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..

Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

Ichata Vahanamulu Nilupa Radu Review: ఇచ్చట వాహనములు నిలుపరాదు… ఒకవేళ నిలిపితే జరిగేది ఇదే!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu