AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ichata Vahanamulu Nilupa Radu Review: ఇచ్చట వాహనములు నిలుపరాదు… ఒకవేళ నిలిపితే జరిగేది ఇదే!

Ichata Vahanamulu Nilupa Radu Review: తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని తప్పులు వెంటాడుతాయి. ఎంతగా అంటే... మనమీద మనకే చిరాకు వచ్చేంతగా! ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కూడా..

Ichata Vahanamulu Nilupa Radu Review: ఇచ్చట వాహనములు నిలుపరాదు... ఒకవేళ నిలిపితే జరిగేది ఇదే!
Ichata Vahanamulu Nilupa Radu Review
Janardhan Veluru
|

Updated on: Aug 27, 2021 | 6:25 PM

Share

(డా. చల్లా భాగ్యలక్ష్మి, ET డెస్క్, టీవీ9 తెలుగు)

చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు నటీనటులు: సుశాంత్‌, మీనాక్షి చౌదరి, వెంకట్‌, అభినవ్‌ గోమటం, ప్రియదర్శి, ఐశ్వర్య, వెన్నెల కిశోర్‌, రవివర్మ తదితరులు నిర్మాతలు: రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల దర్శకత్వం: ఎస్‌.దర్శన్‌ సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు కెమెరా: సుకుమార్‌ ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌ మాటలు: సురేష్‌ బాబా, భాస్కర్‌ ఆర్‌ సహ నిర్మాత: ఆదిత్య శాస్త్రి

తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని తప్పులు వెంటాడుతాయి. ఎంతగా అంటే… మనమీద మనకే చిరాకు వచ్చేంతగా! ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కూడా అలాంటి ఓ చిన్న తప్పు చుట్టూ తిరుగుతుంది. ఇంతకీ ఆ తప్పేంటి? టైటిల్‌లో ఆల్రెడీ కన్వే అయిన తప్పేనా? ఇంటర్నల్‌గా ఇంకేమైనా ఉందా? ఒకసారి చూద్దాం…

అరుణ్‌ ఆర్కిటెక్టిక్ గా పనిచేస్తుంటాడు. అదే కంపెనీకి ఇంటర్న్ షిప్‌ చేయడానికి వస్తుంది మీనాక్షి అలియాస్‌ మీను. ఆమె అన్న నరసింహ యాదవ్‌ ఒక ఏరియాలో పేరున్న కార్పొరేటర్‌. వీళ్ల పక్కింట్లోనే ఓ సీరియల్‌ నటి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయినా కార్పొరేటర్‌గా నెగ్గడానికి నానా కష్టాలు పడుతుంటాడు భూషణ్. వారి ఏరియాలో వరుస దొంగతనాలు జరుగుతుంటాయి. అనూహ్యంగా సీరియల్‌ నటి కూడా హత్యకు గురవుతుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? అసలు ఆ మర్డర్‌ కేసుకి అరుణ్‌ ఫ్రెండ్స్ గ్యాంగ్‌కీ ఉన్న సంబంధం ఏంటి? లోకల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రుద్రతో అరుణ్‌కున్న వైరం ఏంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

మొన్న మొన్నటిదాకా మూస కేరక్టర్లతో మూవ్‌ అయిన సుశాంత్‌ చి.ల.సౌ, అల వైకుంఠపురములో సినిమాలతో తనకంటూ ఓ స్పెషాలిటీని తెచ్చుకున్నారు. ఆ సినిమాల వరుసలో ఇప్పుడు చేసిన సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో హీరో కేరక్టర్‌కి ఉండాల్సిన లక్షణాలన్నీ అరుణ్‌ కేరక్టర్‌లోనూ ఉన్నాయి. కాస్త పక్కింటి అమ్మాయి తరహా రోల్‌లో చేశారు మీనాక్షి. ఏరియా కార్పొరేటర్‌గా రెస్పెక్ట్ ఉన్న వ్యక్తిగా వెంకట్‌ మంచి రోల్‌ చేశారు. కాస్త కన్నింగ్‌ మెంటాలిటీతో భూషణ్‌ క్యారక్టర్‌కి రవివర్మ పర్ఫెక్ట్. బావ మేలుకోరుకునే బావమరిది కేరక్టర్‌ అభినవ్‌ గోమటంకి బాగా సూటయింది. యాజ్‌ యూజువల్‌ ఫ్రెండ్స్ కేరక్టర్‌లో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి పర్ఫెక్ట్ గా సరిపోయారు. టైటిల్‌తోనే సినిమా మీద ఓ క్రేజ్‌ తెచ్చారు దర్శకుడు దర్శన్‌. ఫస్టాఫ్‌ కూడా ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బావుండేది. క్లైమాక్స్ తర్వాత నుంచి సినిమా సిసలైన ఊపందుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు, యాక్షన్‌ సీక్వెన్స్… నిర్లక్ష్యంగా చేసే తప్పుల ఫలితాలు ఎలా ఉంటాయనే డైలాగులు బావున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. స్క్రీన్‌ అంతా కలర్‌ఫుల్‌గా ఉంది. ప్రవీణ్‌ మ్యూజిక్‌కి మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. అపార్ట్ మెంట్‌ లొకేషన్లు, సెకండాఫ్ లో వచ్చే డాబా మీది ఛేజింగ్‌ సీన్లు మెప్పిస్తాయి. స్క్రీన్‌ ప్లే ఇంకాస్త టైట్‌గా ఉండి, ఎడిటింగ్‌ షార్ప్ గా చేసుంటే సినిమాకు ప్లస్‌ అయ్యేది.

టైటిల్‌ని జస్టిఫై చేసే సినిమా. కాకపోతే వాహనాన్ని ఎవరు ఎక్కడ ఎందుకు నిలిపారు? దాని వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు అనేది రివీల్‌ చేస్తే సస్పెన్స్ పోతుంది.. ఏదో ఒక సినిమాకి వెళ్లి, సరదాగా చూడాలనుకునేవారు వెళ్లొచ్చు. వెళ్లినవాళ్లని మాత్రం డైరక్టర్‌ ఓ విషయంలో అలర్ట్ చేస్తారు. సివిక్‌ సెన్స్ గురించి కచ్చితంగా ఒక్క క్షణం ఆలోచించేలా చేస్తారు.

Also Read..

ఈ రాశులవారు నమ్మదగినవారు కాదు.. సీక్రెట్స్ అస్సలు పంచుకోవద్దు..!

ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ?.. ఫ్యాన్‏ను నిరుత్సాహపరిచిన నాని ప్రకటన..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..