AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivaha Bhojanambu Review: కరోనా టైమ్‌ పాస్‌ ఇన్సిడెంట్స్ తో… సరదాగా వివాహ భోజనంబు!

Vivaha Bhojanambu Movie Review: కరోనా టైమ్‌ అనగానే మనకి చాలా విషయాలు ఒన్‌ బై వన్‌ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు మనం కనీసం కనీవిని ఎరుగని లాక్‌డౌన్‌లు, మాస్క్ లు, వలస కూలీల బతుకుతెరువు పాట్లు...

Vivaha Bhojanambu Review: కరోనా టైమ్‌ పాస్‌ ఇన్సిడెంట్స్ తో... సరదాగా వివాహ భోజనంబు!
Vivaha Bhojanambu
Janardhan Veluru
|

Updated on: Aug 27, 2021 | 7:27 PM

Share

– డా. చల్లా భాగ్యలక్ష్మి, ET డెస్క్, టీవీ9 తెలుగు

సినిమా: వివాహ భోజనంబు నటీనటులు: సత్య, ఆర్జవి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, టీఎన్‌ఆర్‌, మధుమణి, శివన్నారాయణ, హర్ష, నిత్యశ్రీ, కిరీటి దామరాజు తదితరులు సంగీతం: అన్వీ కెమెరా: ఎస్‌.మణికందన్‌ ఎడిటింగ్‌: చోటా.కె.ప్రసాద్‌ నిర్మాతలు: కె.ఎస్‌.శినీష్‌, సందీప్‌ కిషన్‌ దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు రచన: భాను బోగవరపు

కరోనా టైమ్‌ అనగానే మనకి చాలా విషయాలు ఒన్‌ బై వన్‌ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు మనం కనీసం కనీవిని ఎరుగని లాక్‌డౌన్‌లు, మాస్క్ లు, వలస కూలీల బతుకుతెరువు పాట్లు… వర్క్ ఫ్రమ్‌ హోమ్‌లు… ఇలా చాలానే అన్నమాట. వాటన్నిటినీ చక్కగా ఇంట్రస్టింగ్‌గా ఒన్‌ బై ఒన్‌ కలిపి అందమైన కథతో స్క్రీన్‌ప్లే రాసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనకు సినిమా రూపమే వివాహ భోజనంబు. శినీష్‌తో కలిసి హీరో సందీప్‌ కిషన్‌ నిర్మించారు. ఇందులో హీరో ఎవరూ అంటూ సినిమా షూటింగ్‌ స్టార్టింగ్‌ టైమ్‌లో కూడా చాలానే ఊరించారు మేకర్స్. కమెడియన్‌ సత్య హీరోగా యాక్ట్ చేసిన మూవీ వివాహ భోజనంబు. కొత్తమ్మాయి ఆర్జవి హీరోయిన్‌. సింపుల్‌గా అతి తక్కువ మంది ఆర్టిస్టులతో తీశారు. ఇంతకీ కథ కమామీషు ఎలా ఉందో చదివేయండి…

పత్తిగింజల మహేష్‌ (సత్య) ఎల్‌.ఐ.సీలో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. అతనికి కమ్యూనికేషన్‌ స్కిల్స్ ప్రాబ్లమ్‌ ఉంటుంది. అందుకోసం స్పెషల్‌గా ఇంగ్లిష్లో ట్రైనింగ్‌ తీసుకుంటాడు. ఆ ట్రైనింగ్‌ ఇచ్చిన అమ్మాయి అనిత (ఆర్జవి). వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అనిత ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. జాయింట్‌ ఫ్యామిలీ. వాళ్ల తాత కులాలకు, ప్రాంతాలకు… ఆఖరికి ఇంటి పేర్లకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. అనిత తండ్రి (శ్రీకాంత్‌ అయ్యంగార్‌)కి … ఆమె మహేష్‌ని ప్రేమించిన విషయం తెలుస్తుంది. తీరా మహేష్‌ ఫోటో చూశాక… అస్సలు రూపురేఖలు నచ్చవు. అయినా అమ్మాయి ఇష్టపడిందని పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత మహేష్‌ పిసినారితనం కూడా నచ్చదు. అసలే పిసినారి అయిన మహేష్‌, పెళ్లి తర్వాత అనిత ఫ్యామిలీని కొన్నాళ్ల పాటు తనింట్లో ఉంచుకుని పోషించాల్సినప్పుడు ఏం చేశాడు? అనిత ఫ్యామిలీ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? వాటిని ఎక్స్ ప్రెస్‌ చేసిన తీరేంటి? మధ్యలో ఆంబులెన్స్ డ్రైవర్‌ ఎవరు? అతని స్టోరీ ఏంటి? ఇలాంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

Vivaha Bhojanmbu

Vivaha Bhojanmbuతెలుగు తెరమీద పిసినారి పాత్రలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటూనే ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత అలాంటి పాత్రలో కనిపించారు సత్య. అనాథగా పెరిగి, సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే కారణంతో పిసినారిగా మారిన అతని గోల్‌ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. బడ్జెట్‌ పద్మనాభం తరహా సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి రూపు రేఖలే కాదు, పద్ధతులు కూడా కన్నవాళ్లను ఇబ్బంది పెడుతున్నాయని తెలుసుకుని, ఇద్దరికీ సర్దిచెప్పలేని కేరక్టర్‌లో హీరోయిన్‌ బాగా యాక్ట్ చేసింది. హీరో ఫ్రెండ్‌గా సుదర్శన్‌, స్వీట్స్ ని ఇష్టపడి తింటూ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కేరక్టర్‌లో శివన్నారాయణ క్యారక్టర్లు కూడా మెప్పిస్తాయి. తన కుమార్తె ఎక్కడ మోసపోయిందో అనే కంగారు ఒక వైపు, నచ్చని అల్లుడు ఇంట్లో స్టే చేయాల్సి రావడం ఇంకో వైపు, దానికి తోడు కరోనా టెన్షన్‌… ఇన్ని వేరియేషన్స్ ఉన్న కేరక్టర్‌లో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ పర్ఫెక్ట్ గా సూటయ్యారు. హర్ష కాసేపే కనిపించినా చక్కగా నవ్వించారు. సడన్‌ సర్‌ప్రైజ్‌గా సందీప్‌ కిషన్‌ ఎంట్రీ బావుంది. అందులోనూ ఏమ్మే భ్రమరా అంటూ, మా నాన్న ఒక మాట చెప్పిల్లా.. అంటూ ఫాదర్‌ని గుర్తుచేసుకుంటూ సందీప్‌ కిషన్‌ చెప్పే డైలాగులు ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. ప్రైమ్‌ మినిస్టర్‌ పెట్టిన కరోనా ఆంక్షలు, ఆ టైమ్‌లో వెలిగించిన దీపాలు, మోగించిన గంటలు, టీవీల్లో హల్‌చల్‌ చేసిన గోధుమ పిండి కోసం వెళ్లే న్యూస్‌, పోలీసులు వీపు బద్ధలు కొట్టే సీన్లు…. ఇలా వైరల్‌ న్యూస్‌ మొత్తాన్ని అందంగా సీన్స్ లో పెట్టే ప్రయత్నం చేశారు డైరక్టర్‌ రామ్‌ అబ్బరాజు. భాను రైటింగ్‌ అట్రాక్టివ్‌గా ఉంది. అందరికీ తెలిసిన విషయాలను అంతందంగా కూర్చడం కూడా సరదాగా అనిపిస్తుంది.

వివాహ భోజనంబు సినిమా మొదలైనప్పుడు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు. కానీ ఒక్కసారి సినిమా మొదలయ్యాక ఎక్కడా ఆపాలనిపించదు. తెలిసిన విషయమే అయినా, ఎక్కడా ఎగ్జయిటింగ్‌ పాయింట్‌గానీ, వండర్‌ఫుల్‌ టర్నింగ్‌గానీ లేకపోయినా, అలా సాగిపోతుంది.అందుకే, సరదాగా చూడాలనుకునేవారికి మంచి టైమ్‌పాస్‌ మూవీ వివాహ భోజనంబు.

Also Read..

Sridevi Soda Center Review: సూరిబాబు లైటింగ్‌.. సోడాల శ్రీదేవి అల్లరి.. కాశీ పెంచుకున్న పగ.. శ్రీదేవి సోడా సెంటర్‌ ఇంతకీ ఎలా ఉందంటే?

Ichata Vahanamulu Nilupa Radu Review: ఇచ్చట వాహనములు నిలుపరాదు… ఒకవేళ నిలిపితే జరిగేది ఇదే!

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!