AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Soda Center Review: శ్రీదేవి ప్రేమకోసం సూరిబాబు కష్టాలు.. ఆకట్టుకుంటున్న శ్రీదేవి సోడా సెంటర్ మూవీ..

సుధీర్ బాబు కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..

Sridevi Soda Center Review: శ్రీదేవి ప్రేమకోసం సూరిబాబు కష్టాలు.. ఆకట్టుకుంటున్న శ్రీదేవి సోడా సెంటర్ మూవీ..
Sudheerbabu
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 28, 2021 | 8:39 AM

Share

నటీనటులు: సుధీర్ బాబు-ఆనంది-నరేష్-పావెల్ నవగీతన్-హర్షవర్ధన్

రచన-దర్శకత్వం: కరుణ్ కుమార్

నిర్మాతలు: విజయ్ చిల్లా-శశి దేవిరెడ్డి

సంగీతం: మణిశర్మ

సుధీర్ బాబు కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘పలాస 1976’ చిత్రంతో దర్శకుడి మంది గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో లైటింగ్ సూరిబాబుగా నటించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగమ్మాయి ఆనంది నటించింది. ఆనంది ఈ మూవీలో సోడాల శ్రీదేవి పాత్రలో కనిపంచింది. ఇక ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో ఇప్పడు చూద్దాం..

కథ : 

లైటింగ్ సూరిబాబు (సుధీర్ బాబు) గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆ కుర్రాడు  ఒక జాతరలో సోడాల శ్రీదేవి (ఆనంది) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజులు ఆమె వెంటపడతాడు.. ఆతర్వాత శ్రీదేవి కూడా అతడిని ప్రేమిస్తుంది. కానీ వేరే కులానికి చెందిన సూరిబాబుతో శ్రీదేవి పెళ్లి చేయడానికి శ్రీదేవి తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ఇదిలా ఉంటే సూరిబాబు అనుకోకుండా ఒక హత్య కేసులో చిక్కుకుని జైలు పాలవుతాడు. దీంతో అతడికి శ్రీదేవి దూరమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? ఆ హత్య కేసునుంచి సూరి బాబు బయటపడ్డాడా.? ఇక్కడి నుంచి సూరి.. శ్రీదేవిల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి.. అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం-విశ్లేషణ:

తెలుగు తెరపై కులాంతర ప్రేమకథలు చాలానే వచ్చాయి. తమిళంలో రెండేళ్ల కిందట వచ్చిన ‘పరియేరుం పెరుమాళ్’ సినిమాలో ఈ నేపథ్యంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటి. అందులో కథానాయికగా నటించిన తెలుగమ్మాయి ఆనంది ‘శ్రీదేవి సోడా సెంటర్’లో శ్రీదేవిగా కనిపించడం విశేషం. ‘పలాస’లో కుల సమస్యను ఎంతో లోతుగా.. హృద్యంగా ప్రెజెంట్ చేసిన కరుణ్ కుమార్.. ఈసారి ఓ ప్రేమకథను కులం కోణంలో సీరియస్ గా చర్చించే ప్రయత్నమే చేశాడు. సినిమా ఆరంభ సన్నివేశాల వరకు ఆసక్తికరంగానే అనిపించినా.. హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాల దగ్గరికి వచ్చేసరికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఆకట్టుకుంది.  హీరో మర్డర్ కేసులో చిక్కుకోవడం.. ఆ తర్వాత ఆ కేసులో వచ్చే మలుపులు ఆసక్తిగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో ఒక చోట నరేష్ పాత్ర.. ‘‘అది లేచిపోయిన ప్రతిసారీ తీసుకురావడమే నా పనైపోతోంది’’ అంటూ అసహనానికి గురవుతుంది. అలాగే హీరో జైలు నుంచి పారిపోవడం.. మళ్లీ పోలీసులకు పట్టుబడటం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే ప్రి క్లైమాక్స్లో కొంతసేపు శ్రీదేవి పాత్రే తెరమీద కనిపించకుండా ఆ పాత్ర ఏమైంది అనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ విషయాన్ని రివీల్ చేసే క్లైమాక్సులో ఒక పావుగంట ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తుంది.

నటీనటులు:

సమ్మోహనం.. నన్ను దోచుకుందువటే లాంటి చిత్రాల్లో క్లాస్ పాత్రలతో మెప్పించిన సుధీర్ బాబు.. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో మాస్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. నటుడిగా అతను పరిణతి సాధించాడని ఈ సినిమా చూస్తున్నంతసేపూ తెలుస్తూనే ఉంటుంది. సూరిబాబు పాత్రను ఓన్ చేసుకుని నటించినట్లు కనిపిస్తుంది. సూరిబాబు పాత్ర కోసం సుధీర్ చాలా కష్టపడి బాడీ కూడా పెంచాడు .. తమిళంలో సత్తా చాటుకున్న తెలుగమ్మాయి ఆనంది.. ఎట్టకేలకు తెలుగులో ఒక పూర్తి స్థాయి మంచి పాత్ర చేసింది. ఆమె శ్రీదేవి పాత్రకు బలం తెచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. విలన్ పాత్రలో చేసిన తమిళ నటుడు పావెల్ నవగీతన్ చాలా బాగా చేశాడు. సీనియర్ నరేష్ తన అనుభవాన్ని చూపించాడు. రఘుబాబు.. సత్యం రాజేష్ కూడా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

నిర్మాణ విలువల విషయంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు ఏమాత్రం రాజీ పడలేదు. కథను నమ్మి బాగా ఖర్చు పెట్టారు. సాంకేతికంగా అన్ని విషయాలూ ఉన్నత ప్రమాణాలతో ఉండేలా చూసుకున్నారు. దర్శకుడు కరుణ్ కుమార్.. మరోసారి ‘పలాస’ తరహాలోనే గ్రామీణ నేపథ్యంలో కులం చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నాడు కథ పరంగా కొత్తదనం లేకపోవడం మైనస్ అయింది. చివర్లో వచ్చే ట్విస్టును సినిమాకే హైలైట్. మణిశర్మ పాటల్లో చుక్కల మేళం ప్రత్యేకంగా అనిపిస్తుంది. . నేపథ్య సంగీతంలో మణిశర్మ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సినిమా శైలికి తగ్గట్లు.. డిఫరెంట్ బీజీఎం ఇచ్చాడాయన. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం సినిమాలో మరో మేజర్ హైలైట్. ఆరంభంలో వచ్చిన పడవ పోటీల ఎపిసోడ్ తో మొదలుపెట్టి.. చాలా సన్నివేశాల్లో శ్యామ్ దత్ ప్రతిభ కనిపిస్తుంది. విజువల్స్ సినిమాకు ఒక రస్టిక్ లుక్ తీసుకొచ్చాయి.

చివరిగా.. లైటింగ్ సూరిబాబు అదరగొట్టేశాడు..