AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuck Jagadish: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ?.. ఫ్యాన్స్‏ను నిరుత్సాహపరిచిన నాని ప్రకటన..

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం టగ్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ,

Tuck Jagadish: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ?.. ఫ్యాన్స్‏ను నిరుత్సాహపరిచిన నాని ప్రకటన..
Tuck Jagadish
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2021 | 6:44 PM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం టగ్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హారిష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ విషయంలో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. నాని ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నాడంటూ వచ్చిన కథనాల నేపథ్యంలో థియేటర్ ఓనర్స్ నాని, టక్ జగదీష్ టీం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో నానిపై పలువురు థియేటర్స్ ఓనర్స్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా.. నానికి మద్దతు రావడం.. చిత్రపరిశ్రమ నుంచి విమర్శలు రావడంతో థియేటర్స్ ఓనర్స్ నానికి క్షమాపణలు చెప్పారు.

తాజాగా ఈ సినిమా విషయంలో ఏర్పడిన సందిగ్ధతలకు చిత్రయూనిట్ స్వస్తి పలికింది. అంతా అనుకున్నట్లుగానే టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేయబోతున్నట్లుగా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పండుగకు మన ఫ్యామిలీతో అంటూ చిన్నపాటి ప్రోమోను నాని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అందులో నాని.. నాయుడుగారి అబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి అంటూ ఫ్యాన్స్‏కు ఇప్పటినుంచి సంబరాలు మొదలెట్టమని సంకేతాలిస్తున్నాడు. అయితే గతంలో నాని ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంతో టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీంతో  కొందరు నాని నిర్ణయానికి మద్ధతు పలుకుతుండగా.. మరికొందరు థియేటర్ ఫీల్ రాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ సినిమాలో నాజర్, జగపతి బాబు, నరేష్, రావు రమేష్, రోహిణి కీలకపాత్రలలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Sridevi Soda Center Review: సూరిబాబు లైటింగ్‌.. సోడాల శ్రీదేవి అల్లరి.. కాశీ పెంచుకున్న పగ.. శ్రీదేవి సోడా సెంటర్‌ ఇంతకీ ఎలా ఉందంటే?

Vijay Sethupathi: పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‏తో కలిసిన మక్కల్ సెల్వన్..