AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‏తో కలిసిన మక్కల్ సెల్వన్..

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటకు తెలుగు

Vijay Sethupathi: పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‏తో కలిసిన మక్కల్ సెల్వన్..
Vijay
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2021 | 4:08 PM

Share

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పవర్ ఫుల్ విలన్ (రాయనం) పాత్రలో మక్కల్ సెల్వన్ అదరగొట్టాడు. దీంతో టాలీవుడ్‏లో సేతుపతికి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఆల్ టైం బిజీగా మారిపోయాడు విజయ్ సేతుపతి. తెలుగుతోపాటు… తమిళ్ భాషలలో వరుస చిత్రాలను చేస్తూనే మరోవైపు బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు మక్కల్ సెల్వన్. ఇదిలా ఉండే.. తాజాగా మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు విజయ్ సేతుపతి. యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోరుమీదున్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం గల్లి రౌడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఇటీవల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా సందీప్ మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ తన 29వ సినిమాను చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నాడు.

తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ మూవీకి మైఖేల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్‏లో రక్తంతో తడిసిన చేతులకు బేడీలు వేసినట్లు కనిపిస్తున్న పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించించనున్నారు.

ట్వీట్..

Also Read: Shilpa Shetty: తప్పు చేశానంటూ శిల్పా శెట్టి ట్వీట్.. ఇంతకీ బాలీవుడ్ బ్యూటీ ఏం చెప్పాలనుకుంటోంది?

Mosagallaku Mosagadu: తెలుగువారి తొలి కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు.. సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి 50 ఏళ్లు..