AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: తప్పు చేశానంటూ శిల్పా శెట్టి ట్వీట్.. ఇంతకీ బాలీవుడ్ బ్యూటీ ఏం చెప్పాలనుకుంటోంది?

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను తెరకెక్కిస్తున్నారన్న

Shilpa Shetty: తప్పు చేశానంటూ శిల్పా శెట్టి ట్వీట్.. ఇంతకీ బాలీవుడ్ బ్యూటీ ఏం చెప్పాలనుకుంటోంది?
Shilpa Shetty
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2021 | 3:21 PM

Share

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను తెరకెక్కిస్తున్నారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం బాలీవుడ్‏లో సంచలనం సృష్టించింది. అతనికి వ్యక్తిరేకంగా పలువురు తారలు, మోడల్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పా శెట్టి ప్రమోయం కూడా ఉందని పోలీసులు ఆమెను పలుమార్లు విచారించారు. తన భర్త అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి కొద్ది రోజులు మీడియా దూరంగా ఉంటూ వచ్చారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం ఇటీవల తిరిగి డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంటూ వచ్చింది. ఇదిలా ఉండే.. శిల్పాశెట్టి నిన్న సాయంత్రం తన ఇన్‏స్టాలో స్టేటస్ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జీవితంలో తప్పులు చేయడం అనే ఐజీ కథనాన్ని శిల్పా శెట్టి షేర్ చేసింది.

Shilpa

Shilpa

అందులో పూర్తి జీవితంలో తప్పులు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని తప్పులు చేయకుండా మన జీవితాలను ఆసక్తికరంగా మార్చుకోలేము.. కాకపోతే అవి ప్రమాదకరమైన తప్పులు, ఇతర వ్యక్తులను బాధించే తప్పులు కాకుడదని మాత్రమే కోరుకోవాలని తెలిపింది. జీవితంలో తప్పులు ఉంటాయి. అయితే వాటిని మార్చిపోవాలనుకునే విషయాలుగా.. ఒక సవాలుగా భావించే అనుభవాలుగా చూడాలని… తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నిజమే నేను తప్పులు చేయబోతున్నాను… అందుకు నన్ను నేను క్షమించుకుంటూ వారి నుంచి నేర్చుకుంటాను అంటూ శిల్పా శెట్టి నేను తప్పు చేశా.. కానీ అది సరైనదే అంటూ ఆ కథకు యానిమేటెడ్ స్టిక్కర్ జతచేసింది.

ట్వీట్..

అశ్లీల చిత్రాలను తెరకెక్కించారనే ఆరోపణలతో రాజ్ కుంద్రాను జూలై 19న మరో 11 మందిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఈ విషయంపై శిల్పా చాలా కాలం మీడియాకు దూరంగా ఉంది. ఇటీవలే శిల్పా తిరిగి డ్యాన్స్ రియాల్టీ షోలో జడ్జిగా పాల్గొంటుంది. ఇక ఇటీవల శిల్పా నటించిన హంగామా 2 సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో శిల్పా నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను బహిష్కరించాలని నెట్టింట్లో పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి.

Also Read: Mosagallaku Mosagadu: తెలుగువారి తొలి కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు.. సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి 50 ఏళ్లు..

AHA: మరో వెబ్‌ సిరీస్‌ను లైన్‌లో పెట్టిన ఆహా.. ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో.