AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani : అలాంటి కామెంట్స్ చదివేంత ఓపిక- ఆసక్తి రెండు ఈ ముద్దుగుమ్మకు లేవంట..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను అనే సినిమాతో..

Kiara Advani : అలాంటి కామెంట్స్ చదివేంత ఓపిక- ఆసక్తి రెండు ఈ ముద్దుగుమ్మకు లేవంట..
Kiara
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 28, 2021 | 8:41 AM

Share

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో యాక్ట్ చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో ఈ అమ్మడు తిరిగి బాలీవుడ్‌‌‌‌కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో దుకుపోతూ.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌‌‌‌గా రాణిస్తుంది. స్టార్ హీరోలందరి సరసన ఈ చిన్నది ఛాన్స్ దక్కించుకుంటుంది. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్‌‌‌లో కబీర్ సింగ్ అనే టైటిల్‌‌‌‌తో రీమేక్ చేశారు. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఒక్కసారిగా కియారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత యంగ్ హీరోలందరిసరసన నటిస్తూ దూసుకుపోతుంది.

కియారా అద్వానీ పేరు పై ఇటీవల మీడియాలో తెగ వినిపిస్తుంది. కియారా పై ట్రోల్స్ కూడా ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. అయితే తన పై వస్తున్న ట్రోల్స్‌ను, నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోను అంటుంది ఈ బ్యూటీ. ఈ బిజీ లైఫ్‌‌‌లో కామెంట్లు చదివేంత ఓపిక..ఆసక్తి తనకి లేవని అంటుంది ఈ బ్యూటీ. నెగిటివ్ వార్తలొచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని తన తల్లిదండ్రులు కంగారు పడరని అంటుంది ఈ చిన్నది. సినిమావాళ్లమే అయినా  తాము కూడా మనుషులేమనని తమకి ఎమోషన్స్ ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చింది. ఒకరి గురించి ఎదుటివారు మాట్లాడినప్పుడు కచ్చితంగా గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలని.. ఇలాంటివాటిలో జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుందని అంటుంది కియారా అద్వానీ. ప్రస్తుతం ఈ భామ రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..

Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..

Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!