AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA: మరో వెబ్‌ సిరీస్‌ను లైన్‌లో పెట్టిన ఆహా.. ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో.

AHA Web Series: సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. వినూత్న సినిమాలతో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రేక్షకులకు పరిచయం...

AHA: మరో వెబ్‌ సిరీస్‌ను లైన్‌లో పెట్టిన ఆహా.. ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో.
Narender Vaitla
|

Updated on: Aug 27, 2021 | 2:06 PM

Share

AHA Web Series: సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. వినూత్న సినిమాలతో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆహా.. తాజాగా మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత నెలలో అమలాపాల్‌ లీడ్‌లో నటించిన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేసిన ఆహా ఇప్పుడు మరో సరికొత్త వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుటున్న సంతోష్‌ శోభన్‌, టినా శిల్పరాజ్‌ జంటగా ‘ది బేకర్‌ అండ్ ది బ్యూటీ’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకులను అందించనుంది. ఈ సిరీస్‌ ఆహా వేదికగా సెప్టెంబర్‌ 10, 2021న విడుదల కానుంది.

ఈ వెబ్‌ సిరీస్‌కు జాన్తన్‌ ఎడ్‌వర్డ్స్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ను ఆహా, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించడం మరో విశేషం. ఈ సిరీస్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఆహా ఫౌండర్‌ అల్లు అరవింద్‌తో పాటు ఆహా సీఈఓ అజిత్‌ థాకూర్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సీఈఓ సుప్రియా యార్లగడ్డ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఈ వెబ్‌ సిరీస్‌పై మేకర్స్‌ ఆసక్తిని పెంచేలా చేశారు. ఇక ఇందులో విష్ణు ప్రియ, సాయి శ్వేత, సంగీత్‌ శోభన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, జాన్సీ లక్ష్మీ, వెంటక్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Bakers

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ కేషెట్‌ ఇంటర్నేషనల్‌ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ స్ఫూర్తిగా దీనిని నిర్మిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కోసం తమ ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ సిరీస్‌ను అందిస్తున్నందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌, విడుదల చేస్తున్న ఆహా ఓటీటీకి కేషెట్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధి కెల్లీ రైట్‌ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి షోలను మరిన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌కు సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కోసం తొలిసారి ఇంటర్నేషనల్‌ ఫ్లేవర్‌ ఉన్న కథను అందిస్తోన్న ఆహా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Tollywood Drugs Case: బిట్ కాయిన్‌ను చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తున్న స్కాం..

New Zealand: పక్షవాతానికి గురైన న్యూజిలాండ్ 

మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్.. మరింత విషమంగా ఆరోగ్యం..!

Dairy Farm Loans: లాభసాటి వ్యాపారం పాడిపరిశ్రమ.. పశువుల పెంపకంకోసం కేంద్రం భారీగా రుణం.. వివరాల్లోకి వెళ్తే..