AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosagallaku Mosagadu: తెలుగువారి తొలి కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు.. సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి 50 ఏళ్లు..

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి అగ్రకథానాయకులు తెలుగు చిత్రసీమలో రాజ్యమేలుతున్న సమయం అది. నటనమీద ఆసక్తితో సినీపరిశ్రమలో తనకంటూ

Mosagallaku Mosagadu: తెలుగువారి తొలి కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు.. సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి 50 ఏళ్లు..
Mosagallaku Mosagadu
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2021 | 2:42 PM

Share

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి అగ్రకథానాయకులు తెలుగు చిత్రసీమలో రాజ్యమేలుతున్న సమయం అది. నటనమీద ఆసక్తితో సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..  సహాయ పాత్రలు చేస్తూ వచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ. అటు పౌరాణిక, చారిత్రక సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వారి స్థానాన్ని ఎలాగైనా చేరుకోవాలని తాపత్రాయపడ్డాడు. అటు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే మరోవైపు సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పాలని భావించాడు కృష్ణ. ఇందుకు తన తమ్ముళ్లు జి. హనుమంతరావు, జి. ఆదిశేషగిరిరావు సైతం సహాయం చేశారు. అలా ఈ ముగ్గురి అన్నదమ్ములు కలిసి పద్మాలయా పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు. పద్మాలయా పిక్చర్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా అగ్ని పరీక్షను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఈ సినిమా మిగిల్చిన నిరాశతో ఏమాత్రం కుంగిపోకుండా.. మరో ప్రయాత్నానికి నాంది పలికారు కృష్ణ సోదరులు. అదే కౌబోయ్ చిత్రం. హాలీవుడ్ కౌబోయ్ చిత్రాల కలయికతో తెలుగులో మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా 1971 ఆగస్ట్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన మోసగాళ్లకు మోసగాడు విడుదలైన నేటికి 50 ఏళ్లు పూర్తి. తెలుగులో మొదటిసారిగా వచ్చిన తొలి కౌబోయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా.

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి తెలుగు కౌబోయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాలో గుమ్మడి, నాగభూషణం, సత్యనారాయణ, ముక్కామల, ధూళిపాల, జ్యోతిలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు వంటివారు కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్‏లో సూపర్ హిట్ సాధించిన మెకనాస్ గోల్డ్, ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫర్ ఏ ఫ్యూ డాలర్స్ మోర్ వంటి చిత్రాల కలగలుపుగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను నిర్మించించింది పద్మాలయ పిక్చర్స్ సంస్థ. ఈ సినిమాకు రచనతోపాటు పాటలను కూడా ఆరుద్ర రాశారు.

2

బొబ్బిలి యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ వారికి దక్కకుండా జమీందారులు తమ సంపదను ఓ చోట దాస్తారు. ఆ గుట్టు తెలిసిన కొత్వాల్‏ను బంధించి ఆ నిధి రహస్యం చెప్పమని అడగ్గా.. అతను నిరాకరించడంతో అతడిని చంపేస్తారు. అయితే ధర్మం కోసం కొత్వాల్ కొడుకు కృష్ణ ప్రసాద్ ఈ విషయం తెలుకుని తన తండ్రిని చంపిన వారికి చంపడానికి బయలుదేరతాడు. రాధ అనే అమ్మాయితోపాటు.. నక్కజిత్తుల నాగన్న అనే దొంగతో కలిసి తనవారిని చంపిన వారిని చంపడానికి బయలుదేరతాడు కృష్ణ ప్రసాద్. అలా వెళ్లిన కృష్ణ.. అనుకున్నట్టుగానే అందరిని చంపేసి నిధిని సాధిస్తాడు. ఆ తర్వాత నాగన్నను ఓ చెట్టుకు వేలాడిదీయాగా.. కృష్ణ ప్రసాద్ అతడిని కాపాడతాడు.

సినిమా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించాయి. కృష్ణ ప్రసాద్ ప్రయాణం.. తన కన్నవారిని చంపినవారి గురించి తెలుసుకోవడం.. వారిని మట్టుబెట్టడం ఇలా అన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. అందుకే తెలుగు తొలి కౌబోయ్ సూపర్ హిట్ అయ్యింది. హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. అందుకే ఆయన కౌబోయ్‏గా గుర్తింపు సాధించారు. ఈ మూవీతో చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ స్టార్‏డమ్ అందుకున్నారు. కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోయింది. అంతేకాదు.. ఈ సినిమా అన్ని భాషల్లోకి డబ్ అయి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా… అప్పట్లోనే 125 దేశాలలో రిలీజైన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు ఆది నారాయణ రావు సంగీతం అందించగా.. వియస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించారు.

Also Read: AHA: మరో వెబ్‌ సిరీస్‌ను లైన్‌లో పెట్టిన ఆహా.. ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో.