AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Student Credit Cards: విద్యార్థులకు ప్రత్యేక క్రెడిట్​ కార్డులు.. ప్రయోజనాలు ఎన్నో..!

Student Credit Cards: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు చాలా మందే ఉపయోగిస్తున్నారు. ఈ క్రెడిట్‌ కార్డులను సరిగ్గా వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి..

Student Credit Cards: విద్యార్థులకు ప్రత్యేక క్రెడిట్​ కార్డులు.. ప్రయోజనాలు ఎన్నో..!
Student Credit Cards
Subhash Goud
|

Updated on: Aug 27, 2021 | 4:58 PM

Share

Student Credit Cards: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు చాలా మందే ఉపయోగిస్తున్నారు. ఈ క్రెడిట్‌ కార్డులను సరిగ్గా వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. లేకపోతే పెనాల్టీలతో మోత మోగిపోతుంది. ఇక కొన్ని బ్యాంకులు 18 సంవత్సరాలు దాటిన కళాశాల విద్యార్థులకు క్రెడిట్​ కార్డులను అందిస్తున్నాయి. ఎటువంటి ఆదాయం లేకున్నా సరే, తక్కువ వడ్డీ రేటుకే 5 సంవ్సతరాల కాలపరిమితితో ఈ క్రెడిట్​కార్డులను అందిస్తుండటం విశేషం. అయితే ఈ స్టూడెంట్​క్రెడిట్ కార్డు ప్రయోజనాలు సాధారణ క్రెడిట్ కార్డు కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి పే స్లిప్​లేదా ఐటిఆర్ అవసరం లేదు. మీరు తీసుకున్న అప్పును సకాలంలో చెల్లిస్తే రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ క్రెడిట్​కార్డులు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.

క్రెడిట్ లిమిట్ ఎంతంటే..

ఇక దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా (SBI)తో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా స్టూడెంట్​క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇతర క్రెడిట్ కార్డులతో పోలిస్తే, విద్యార్థి క్రెడిట్ కార్డులు చాలా తక్కువ క్రెడిట్ లిమిట్‌ ఉంటుంది. దీని క్రెడిట్ లిమిట్ రూ.15,000 నుండి రూ.20000 మధ్య ఉంటుంది. విద్యార్థులకు సరైన ఆదాయం ఉండదు కాబట్టి వారు ఎక్కువగా ఖర్చు చేయకుండా, రుణాల ఇబ్బందుల్లో పడకుండా నివారించేందుకు ఈ పరిమితిని విధించాయి. అయితే.. వీటికి బ్యాంకులు ఎటువంటి ప్రాసెసింగ్​ఫీజును వసూలు చేయవు. అంతేకాదు.. వీటికి వార్షిక రుసుము కూడా చాలా తక్కువ. స్టూడెంట్ క్రెడిట్ కార్డు దరఖాస్తు కోసం బర్త్​ సర్టిఫికేట్, స్టూడెంట్​ఐడెంటిటీ కార్డు, రెసిడెన్సీ ప్రూఫ్​, పాస్​పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ లేదా పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్స్​ను సంబంధింత బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది.

ఈ క్రెడిట్‌ కార్డు కాలపరిమితి కూడా ఎక్కువే. 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు ఉంటుంది. తర్వాత దానిని పెంచుకోవచ్చు. విద్యార్థులు సమయానికి డబ్బులు చెల్లించకపోతే తక్కువ వడ్డే విధిస్తాయి బ్యాంకులు. అంతేకాదు క్రెడిట్‌ కార్డుల మోసాల విషయంలో రూ.5 లక్షల బీమా రక్షణను అందిస్తుంటాయి. ఒకవేళ విద్యార్థుల క్రెడిట్‌ కార్డును పోగొట్టుకున్నా.. వేరే కార్డును జారీ చేస్తాయి బ్యాంకులు. ఇందుకు కార్డు ఉచితంగా లేదా నామ మాత్రపు ఫీజు మాత్రమే వసూలు చేస్తాయి. అయితే విద్యార్థులకు క్రెడిట్‌ కార్డులు అన్ని బ్యాంకులు అందించవు. చాలా తక్కువ బ్యాంకులు అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ, యాక్సిస్‌ బ్యాంకులు అందిస్తున్నాయి.

అయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ లోన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేక క్రెడిట్ కార్డ్. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఎస్‌బిఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ కార్డు పొందవచ్చు. ఎడ్యుకేషన్​లోన్‌ను సకాలంలో చెల్లించే వారికి 20 నుండి 50 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్ లభిస్తుంది. ఈ కార్డుకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీనితో ఏదైనా పెట్రోల్ పంపు వద్ద 2.5 శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు పొందవచ్చు. మొత్తం లిమిట్​లో 80% నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులను ఈఎంఐ (EMI) లకు మార్చడానికి ఫ్లెక్సిపే ఆప్షన్​కూడా ఎంచుకోవచ్చు. స్టూడెంట్ క్రెడిట్ కార్డు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది.

ఇవీ కూడా చదవండి:

Central Government: కొత్తగా కారు కొనేవారికి శుభవార్త.. దీపావళికి ఆ ప్రకటన వచ్చే అవకాశం..?

Positive Pay System: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఇక నుంచి నిబంధనలు మారనున్నాయి.. తప్పక తెలుసుకోండి.!

Health Insurance: మహిళలకు ఆరోగ్య బీమా పాలసీ.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!