- Telugu News Photo Gallery Business photos Looking to buy a car Central government considers tax cut to make them cheaper
Central Government: కొత్తగా కారు కొనేవారికి శుభవార్త.. దీపావళికి ఆ ప్రకటన వచ్చే అవకాశం..?
Central Government: మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించే అవకాశం ఉంది. దీపావళి పండగకు ముందు ఈ..
Updated on: Aug 26, 2021 | 1:51 PM

Central Government: మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించే అవకాశం ఉంది. దీపావళి పండగకు ముందు ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. మోదీ సర్కార్ పన్ను తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తోందని తెలియజేస్తున్నాయి.

వాహన అమ్మకాలు తగ్గిపోయిన నేపథ్యంలో కేంద్ర సర్కార్ పన్ను కోత నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దీపావళి కన్నా ముందే ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

మోదీ ప్రభుత్వం ఒకవేళ కార్లపై పన్ను తగ్గిస్తే.. కారు కొనే వారికి చాలా ఊరట లభించనుంది. కార్ల ధరలు దిగివస్తాయి. దీంతో కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశమనే చెప్పవచ్చు.

మరోవైపు మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ మాట్లాడుతూ.. ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్‌పై ట్యాక్స్ రేటు.. యూరోపియన్ యూనియన్, జపాన్, అమెరికా కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రాల 8-9 శాతం రోడ్డు ట్యాక్స్‌ను కలుపుకుంటే ఇండియాలో కార్లపై ట్యాక్స్ 37-38 శాతానికి చేరిందని, ఇంత ట్యాక్స్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. వెహికల్ ట్యాక్స్ జర్మనీలో 19-20 శాతంగా, జపాన్‌లో 18-22 శాతంగా ఉంది.




