New PF Rule: మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా..? అయితే ఈ పని పూర్తి చేయండి.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

New PF Rule: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ‌పీ‌ఎఫ్‌ఓ) ఖాతాదారుల కోసం నియమాలలో కొన్ని మార్పులు చేసింది. మీరు ఈ మార్పులను ముందుగా తెలుసుకోవాలి..

New PF Rule: మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా..? అయితే ఈ పని పూర్తి చేయండి.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు
Follow us
Subhash Goud

|

Updated on: Aug 27, 2021 | 7:19 PM

New PF Rule: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ‌పీ‌ఎఫ్‌ఓ) ఖాతాదారుల కోసం నియమాలలో కొన్ని మార్పులు చేసింది. మీరు ఈ మార్పులను ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రూల్స్ మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు. ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి ఒక్క పీ‌ఎఫ్ ఖాతాదారుడు వారి పీ‌ఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నిబంధన 1 సెప్టెంబర్ 2021 నుండి అమలులోకి వస్తుంది. గతంలో జూన్ 1న ఈ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉండగా, తర్వాత గడువుపు పొడిగించారు. అంటే పీఎఫ్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఆగస్టు 31లోగా ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోతే పి‌ఎఫ్ ఖాతాకు చేరే డబ్బులు నిలిచిపోతాయి. అలాగే ఎలక్ట్రానిక్ చలాన్ అండ్ రిటర్న్ (ECR) నింపలేరు. సోషల్ సెక్యూరిటి కోడ్ 2020 కింద ఆధార్‌ని పీ‌ఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని ఈ‌పీ‌ఎఫ్‌ఓ ఈ ​నిర్ణయం తీసుకుంది.

ఈపీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా మీరు ఈ లింక్‌ చేసే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇందుకు ముందుగా మీరు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఆ తరువాత వెబ్‌సైట్‌ లింక్‌ పై క్లిక్‌ చయండి. ఇప్పుడు మీరు యూఏఎన్‌ అండ్‌ పాస్‌వర్డ్‌తో మీ పీఎఫ్‌ ఖాతాకు లాగిన్‌ కావాలి. ఇప్పుడు ‘మేనేజ్’ విభాగంలో కే‌వై‌సి ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఈ‌పీ‌ఎఫ్ ఖాతాతో లింక్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ చూస్తారు. ఇక్కడ ఆధార్ ఆప్షన్ ఎంచుకుని ఆధార్ కార్డుపై ఉన్న మీ ఆధార్ నెంబర్, మీ పేరును టైప్ చేసి సర్వీస్‌పై క్లిక్ చేయండి.

దీని తర్వాత మీరు ఇచ్చిన సమాచారం సేవ్ అవుతుంది, మీ ఆధార్ యూ‌ఐ‌డి‌ఏ‌ఐ డేటాతో వేరిఫై అవుతుంది. ఒక్కసారి మీ కే‌వై‌సి డాక్యుమెంట్స్ వేరిఫై తర్వాత మీ ఆధార్ కార్డు మీ పీ‌ఎఫ్ ఖాతాతో లింక్ అవుతుంది. మీ ఆధార్ సమాచారం ముందు వేరిఫైడ్ అని చూపిస్తుంది.

కాగా, ఇలాంటి పనులు చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని ఖాతాలకు, ఆధార్‌, పాన్‌ ఇలా అన్నింటికి లింక్‌ చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది కూడా ఇలాంటి లింక్‌లు చేయడం తెలియదు. అందుకే ముందస్తుగా గడువులోగా ఇలాంటి పనులు పూర్తి చేసుకోవడం బెటర్‌. లేకపోతే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి లింక్‌లు చేయడం తెలియకపోతే ఇంకేవరినైనా అడిగి తెలుసుకొని పూర్తి చేసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

SBI ATM: మీరు కొత్త ఏటీఎంను పొందాలనుకుంటున్నారా..? రెండు నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోండిలా..!

Student Credit Cards: విద్యార్థులకు ప్రత్యేక క్రెడిట్​ కార్డులు.. ప్రయోజనాలు ఎన్నో..!

విదేశాలకు వెళ్లే వారు కోవిడ్‌-19 సర్టిఫికేట్‌తో పాస్‌పోర్టును లింక్‌ చేసుకున్నారా..? అయితే ఇలా చేయండి..!

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు