IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు భారీ నష్టం.. పాయింట్ల పట్టికలో తొలిస్థానం హుష్‌కాకి.. తక్కువ పాయింట్లతో అగ్రస్థానం చేరుకున్న జట్టేదో తెలుసా?

ఇంగ్లండ్ పర్యటన టీమిండియాకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇక్కడ ఆడిన మొదటగా ఆడిన తొలి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఓడి, ఇంగ్లండ్ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. రెండవ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా..

IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు భారీ నష్టం.. పాయింట్ల పట్టికలో తొలిస్థానం హుష్‌కాకి.. తక్కువ పాయింట్లతో అగ్రస్థానం చేరుకున్న జట్టేదో తెలుసా?
Indian Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2021 | 8:47 AM

2nd World Test Championship: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన ఇప్పటివరకు ఒడిదుడుకులతోనే కొనసాగుతోంది. జూన్‌లో ప్రారంభమైన ఈ పర్యటనను భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో ప్రారంభించింది. ఈ ఫైనల్లో ఓటమితో ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించింది. అలాగే తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌లోనూ ఘెరంగా ఓడిపోయింది. డబ్య్లూటీసీ ఓటమి నిరాశను అధిగమించి, భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో రెండవ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. ఇందులో భారత్ బాగానే రాణించింది. అయితే లీడ్స్ టెస్ట్ ఓటమితో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్‌తో పాటు టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో ఇంగ్లండ్ సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించింది. దీంతో భారత్ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది.

లీడ్స్ టెస్టుకు ముందు భారత్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్, వెస్టిండీస్ 12 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, ఇంగ్లండ్ కేవలం 2 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. లీడ్స్‌లో భారత్ ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లండ్‌ 14 పాయింట్లతో నిలిచింది. ఈ విజయం తర్వాత, పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ స్థానంలో ఎటువంటి మార్పు లేదు. కానీ, భారత్ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్ రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుతం పాకిస్తాన్‌ తొలి స్థానానికి చేరుకుంది.

అగ్రస్థానంలో పాకిస్తాన్.. భారత్, ఇంగ్లండ్ చెరో 14 పాయింట్లతో ఉండగా, పాకిస్తాన్ ,వెస్టిండీస్ తలో 12 పాయింట్లు కలిగి ఉన్నాయి. కానీ, ఈ పాయింట్లతో పాకిస్తాన్ టీం ఎలా టాప్ ప్లేస్‌లోకి చేరందని పలువురు డౌట్ పడుతున్నారు. రెండవ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నూతన పాయింట్ల విధానంతోనే ఇలా జరిగింది. తొలి సీజన్ పాయింట్ల విధానాన్ని మార్చిన ఐసీసీ.. ప్రతీ టెస్ట్‌కు 12 పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చింది. అంటే విజేత జట్టుకు 12 పాయింట్లు లభించనున్నాయి. పాయింట్ల పట్టికలో జట్ల స్థానం అత్యధిక పాయింట్లతో నిర్ణయించబడదు. టీంల స్థానం పాయింట్ల శాతంతో డిసైడ్ చేస్తారు.

ఈ కారణంగా భారత్, ఇంగ్లండ్ టీంలు ఇప్పటివరకు చెరో 36 పాయింట్ల కోసం పోరాడాయి. ఇందులో ఇద్దరికీ 14 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ఈ కోణంలో ఇరుటీంలు 38.88 శాతం పాయింట్లు సాధించాయి. అదే సమయంలో, పాకిస్తాన్, వెస్టిండీస్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాయి. ఇందులో రెండూ ఒక్కో మ్యాచ్ గెలిచాయి. సమానంగా పాయింట్లు సాధించాయి. దీంతో ఇరు టీంలకు 50.0 శాతం పాయింట్లు వచ్చాయి. అందుకే ఈ రెండు జట్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

భారత్‌కు అత్యంత కఠినమైన టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్… అయితే, ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండవ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది మొదటి సిరీస్. ప్రతీ జట్టు ఛాంపియన్‌షిప్‌లో 6 టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో 3 స్వదేశంలో, 3 విదేశాలలో ఆడాల్సి ఉంటుంది. విదేశీ సిరీస్‌ల విషయానికొస్తే, టీమిండియాకు ఇంగ్లండ్ నుంచే కష్టమైన సవాలు మొదలైంది.

Also Read:

IND vs ENG: టీమిండియాకు మరో షాక్.. లీడ్స్ టెస్టులో గాయపడిన మరో ఆటగాడు..!

Ashes Series: యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ టీంలో సంక్షోభం.. ఆస్ట్రేలియా ఆంక్షలపై ఇంగ్లీష్ ఆటగాళ్ల తిరుగుబాటు.. దాదాపు 10 మంది దూరమయ్యే ఛాన్స్?

IND vs ENG: ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ పేలవ ఆటతీరుపై నెటిజన్ల మండిపాటు.. ఆయన్ను తీసుకోండంటూ టీమిండియాకు రిక్వెస్ట్

పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!