India vs England: టీమిండియా స్టార్ క్రికెటర్లపై సెటైర్లు వేసిన ప్రముఖ యాంకర్.. నెట్టింట్లో చర్చనీయంశంగా మారిన ఇన్‌స్టా స్టోరీ

India vs England: భారత క్రికెటర్ భార్య టీమిండియా స్టార్ ఆటగాళ్లపై సెటైర్లు విసిరింది. ఇంగ్లండ్ సిరీస్‌లో విఫలమవుతోన్న ఆటగాళ్లపై కామెంట్లు చేసి, అండర్సన్ ఫొటోను షేర్ చేసి అసహనం వ్యక్తం చేసింది.

India vs England: టీమిండియా స్టార్ క్రికెటర్లపై సెటైర్లు వేసిన ప్రముఖ యాంకర్.. నెట్టింట్లో చర్చనీయంశంగా మారిన ఇన్‌స్టా స్టోరీ
Binny
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2021 | 9:01 PM

India vs England: భారత క్రికెటర్ భార్య టీమిండియా స్టార్ ఆటగాళ్లపై సెటైర్లు విసిరింది. ఇంగ్లండ్ సిరీస్‌లో విఫలమవుతోన్న ఆటగాళ్లపై కామెంట్లు చేసి, అండర్సన్ ఫొటోను షేర్ చేసి అసహనం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత మయంతి లాంగర్. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రాంలో ఓ స్టోరీని పోస్ట్ చేసింది. మయంతి భర్త స్టువర్ట్ బిన్నీ 2014లో ఇంగ్లండ్ పర్యటనలో అండర్సన్ బౌలింగ్‌లో బౌండరీ బాదినప్పడు.. దానికి ఇంగ్లీష్ స్టార్ బౌలర్ తలపట్టుకున్న ఓ ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2014 ఇంగ్లండ్ పర్యటన ద్వారా టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన స్టువర్ట్ బిన్నీ. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీలో మయంతి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇంగ్లండ్‌లో స్టార్ బౌలర్ ఆండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లకాదన్నట్లు ఈ ఫొటో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో కోహ్లి, రహానే, పుజారాలపై సెటైర్లు వేసిందని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.

భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ వ్యాఖ్యత మయంతి లాంగర్‌ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ అయితే ప్రకటించలేదు. బిన్నీ చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడాడు. ఆతరువాత టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కాగా ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ఆయన.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు.

Mayanti Langer

కాగా, టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన స్టువర్ట్ బిన్నీ.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో బిన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక వన్డే క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి రికార్డులు నెలకొల్పాడు. బిన్నీ(6/4) పేరిటే నమోదై ఉండడం విశేషం. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు.

Also Read: 500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?

INDW vs AUSW: కోవిడ్ -19 కారణంగా షెడ్యూల్‌లో మార్పు.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే..?

Viral Video: పతకం గెలిచిన ఆనందంలో డాన్స్ చేసిన భారత అథ్లెట్.. ఆమె స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..!