Side Effects of Kiwi: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..
Side Effects of Kiwi: కివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సి విటమిన్ మనిషి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే, కివి అందరికీ...
Side Effects of Kiwi: కివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సి విటమిన్ మనిషి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే, కివి అందరికీ ఒకేవిధంగా మేలు చేయదు. కొందరు మేలు చేస్తే.. మరికొందరికి ఇబ్బందులు కొనితెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఐదు రకాల సమస్యలతో బాధపడే ప్రజలు ఈ కివి పండ్లకు దాదాపుగా దూరం అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
1. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివి పండ్లకు దూరంగా ఉండాలి. వాస్తవానికి కివిలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిపై మరింత ఎఫెక్ట్ చూపుతుంది. అందుకే.. కిడ్నీ రోగులు ఆహారంలో పొటాషియం తక్కువ మొత్తంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
2. కివిలో నిమ్మ, నారింజ కంటే రెండు రెట్లు విటమిన్ సి, యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కివి కిడ్నీ రోగులకు మంచిది కాదు.
3. కివిని కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల చర్మానికి మంచిది, కానీ అధికంగా తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. తామర, చర్మంపై దద్దుర్లు, పెదవులు, నాలుక వాయడం జరుగుతుంది. ఒకవేళ మీకు స్కిన్ అలర్జీ ఉన్నట్లయితే.. కివి ని తినడం మానేయండి.
4. గర్భిణీ స్త్రీలు ఒక రోజులో రెండు లేదా మూడు కివిలకు మించి తినకూడదు. కివి ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ, చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
5. మీకు గ్యాస్ట్రిటిస్, జీర్ణక్రియకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కివి తినవద్దు. కివిలో ఉండే యాసిడ్ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, దీని కారణంగా మైకం, వాంతులు, విరేచనాల సమస్య తలెత్తవచ్చు. అలెర్జీ ఉన్నవారు కివి పండ్లకు దూరం ఉండటం ఉత్తం. కివి గానీ, కివీ నుంచి తయారైన పదార్థాలు గానీ తినడం పూర్తిగా మానేయాలి.
Also read:
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..