సంతాన సాఫల్యానికి కొత్త జంటలు ఎందుకు దూరమవుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందా?

సంతానం.. నిజంగా సాఫల్యమే. పిల్లలు పుట్టిన దంపతులు ఎన్నికోట్లు సంపాదించినా.. ఆ లోటు ఉండనే ఉంటుంది. కొత్త జంటలు సంతాన సాఫల్యానికి

సంతాన సాఫల్యానికి కొత్త జంటలు ఎందుకు దూరమవుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందా?
Couple
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 29, 2021 | 10:23 PM

Fertility : సంతానం.. నిజంగా సాఫల్యమే. పిల్లలు పుట్టిన దంపతులు ఎన్నికోట్లు సంపాదించినా.. ఆ లోటు ఉండనే ఉంటుంది. కొత్త జంటలు సంతాన సాఫల్యానికి ఎందుకు దూరమవుతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏవైనా ఉన్నాయా? అంటే.. అనేక కారణాలు కన్పిస్తున్నాయి. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు తహతహలాడుతున్నాయి పెళ్లైన జంటలు. చివరికు తల తాకట్టు పెట్టైనా తమ వంశాన్ని నిలుపుకోవాలని చూస్తున్నాయి.

ఎందుకీ సంతానలేమి? గతంలో లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణమేంటి అంటే మన ఆలోచన విధానమే అంటున్నారు డాక్టర్ రాధిక. మన జీవన విధానమే.. మనకు ప్రమాదంగా మారుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా కెరీర్‌పై ఫోకస్ పెడుతున్న యువత.. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవారిలో అండాశయాల్లో ఎగ్స్‌ లేట్‌గా రిలీజ్‌ అవుతున్న కారణంగా అనుకున్న సమయానికి ప్రెగ్నెన్సీ రావడం లేదంటున్నారు. లేట్ వయస్సు పెళ్లిళ్లు.. దీనంతటికి కారణమని స్పష్టం చేస్తున్నారు.

భార్య, భర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత మందికైతే.. కనీసం ఇద్దరు ఒకేసారి ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటివి అనేకం సంతానలేమికి కారణం అవుతుందని గైనకాలజిస్ట్‌లు స్పష్టం చేస్తున్నారు. మన బాడీని మనం కంట్రోల్ చేసుకోగల్గితేనే సంతానప్రాప్తి సాధ్యం అవుతుందని వివరిస్తున్నారు.

సంతానలేమికి కేవలం స్ట్రీలు మాత్రమే కారణమా? అంటే కానే కాదు. స్ట్రీ, పురుషులిద్దరికి సమాన బాధ్యత ఉంటుంది. పిల్లలు పుట్టకపోతే.. కేవలం ఆడవారిని నిందించడంలో అర్థం లేదన్నది వైద్య నిపుణుల అంచనా. ముఖ్యంగా మగవారిలో ఒత్తిడి, జీన్స్ వంటి బట్టలు ధరించడం కారణమంటున్నారు వైద్యులు. ఈ క్రమంలో వారికి కొంత అవగాహన కల్గించాలంటున్నారు డాక్టర్ వెంకట సుబ్బయ్యి. ముందు కెరీర్.. ఆ తర్వాత పెళ్లి, ఎక్కువ మందికి లేటు వయస్సులో పెళ్లిళ్లు, ఉద్యోగాల బిజీలో భార్య, భర్తలిద్దరు, చాలెంజింగ్‌గా మారిన జీవనశైలి.. ఇలా అనేక అంశాలు సంతానలేమి కారణాలు అవుతున్నాయి.

Read also:  OU: ఉస్మానియా హాస్టల్స్ దగ్గర మంత్రి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ మోతే శ్రీలత ‘చాయ్ పే చర్చ’