Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వైట్ రైస్ తింటూనే బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు వైట్ రైస్ తినడం మానేయాలని చాలామంది అంటుంటారు. అయితే, అదంతా వట్టి బూటకమని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: వైట్ రైస్ తింటూనే బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
Rice
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2021 | 6:13 AM

Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు వైట్ రైస్ తినడం మానేయాలని చాలామంది అంటుంటారు. అయితే, అదంతా వట్టి బూటకమని నిపుణులు చెబుతున్నారు. మీకు ఇష్టమైన ప్రకారం వైట్ రైస్ తినొచ్చని చెబుతున్నారు. వైట్ రైస్ తింటూనే బరువు కూడా తగ్గించుకోవచ్చునని పేర్కొంటున్నారు. అంతేకాదు.. వైట్ రైస్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందట. ఇందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే.. బెల్లీ ఫ్యాట్‌ను సునాయాసంగా తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు.

వాస్తవానికి వైట్ రైస్‌ హెల్తీ ఫుడ్ లిస్ట్‌లో లేదు. కారణం.. ఇందులో అధిక కేలరీలు ఉండటమే. వైట్ రైస్‌లో ఉండే అధిక కేలరీలు.. ఆరోగ్యానికి హానీకరం అని అంటుంటారు. అయితే, సరైన రీతిలో అన్నం తినడం ద్వారా జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. మరి బరువు తగ్గడానికి వైట్ రైస్‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వైట్‌రైస్‌తో బరవు తగ్గొచ్చు .. పోషకాహార నిపుణులు, ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడానికి తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు పదార్థాలు తినాలని తరచుగా సిఫార్సు చేస్తుంటారు. ముఖ్యంగా వైట్ రైస్ తినడం మంచిదేనని అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వైట్ రైస్ గ్లూటెన్ రహిత ఆహారం. ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతుంది. ఈ కారణంగా జీవక్రియ పెరుగుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తెల్ల బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ బి, మెగ్నీషియం, ఇతర పోషకాలు ఉంటాయి. అయితే, తెల్ల బియ్యం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే.. అన్నం తినేటప్పుడు ఈ కింది విషయాలను గుర్తుంచుకోవాలి..

అన్నం ఎంత తినాలంటే.. మీరు బరువు తగ్గాలని భావిస్తున్నట్లయితే.. ముందుగా మీరు తినే ఆహార పరిణామంపై శ్రద్ధ పెట్టండి. వైట్ రైస్‌ని మితంగా తినండి. అన్నంతో ఇతర వేరే కార్పొహేడ్రేట్, కొవ్వు పదార్థాలను తినొద్దు.

వండటంలో జాగ్రత్త వహించాలి.. సరిగ్గా ఉడికించడం ద్వారా బియ్యంలో ఉండే అధిక కార్బోహైడ్రేట్లను తొలగించొచ్చు. మీరు బియ్యాన్ని కొన్ని గంటలు నానబెట్టడం, ఉడకబెట్టడం వంటివి చెయొద్దు. ముఖ్యంగా అన్నం వండేటప్పుడు అందులో నెయ్యి లేదా ఏ రకమైన నూనె పదార్థాలను ఉపయోగించవద్దు. ఇలా చేయడం వల్ల కేలరీలు పెరుగుతాయి.

ఆకు కూరగాయలు తినాలి.. వైట్ రైస్‌లో ఆకు కూరలను కలిపి తినండి. ఇతర కాయగూరలు అయినా పర్వాలేదు. మీ అన్నంతో పోషకాలు ఎక్కువగా లభించాలంటే ముఖ్యంగా ఆకు కూరలు తప్పనిసరి.

Also read:

Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..

Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..