Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..
Mumbai Fire Accident: మహారాష్ట్రలోని ముంబై పట్టణంలో ధారావిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు 17 మందికిపైగా గాయపడినట్లు..
Mumbai Fire Accident: మహారాష్ట్రలోని ముంబై పట్టణంలో ధారావిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు 17 మందికిపైగా గాయపడినట్లు సమాచారం అందుతోంది. అధికారిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని ధారివిలో గల ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. దాంతో ఆ ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 17 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు.
క్షతగాత్రులందరినీ స్థానిక సియాన్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. అయితే, గ్యాస్ సిలిండర్ పేలడానికి గల ఖచ్చితమైన కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..
Nalgonda: నల్లగొండ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం.. పోలీసుల ఎంట్రీతో ప్రాణాలతో బయటపడ్డ యువకులు..
Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చనిపోయిన గేదెపైకి ఎక్కిన ఆటో..