Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. గంజాయి సేవించాక జరిగిన వివాదంలో స్నేహితుడిని కత్తెరతో పొడిచి అతికిరాతకంగా హతమార్చిన ఘటన

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..
Ap Crime News
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 30, 2021 | 5:09 AM

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. గంజాయి సేవించాక జరిగిన వివాదంలో స్నేహితుడిని కత్తెరతో పొడిచి అతికిరాతకంగా హతమార్చిన ఘటన చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే, చార్మినార్, కాలాపత్తర్, చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలలో స్నేహితులే ఇలా కాలయముళ్లై వరుస హత్యలకు పాల్పడుతుండటంతో పాతబస్తీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. తమ పిల్లలను స్నేహితులతో పంపించాలంటేనే జంకుతున్నారు. చత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్ పేట్‌కు చెందిన అయ్యవారి ఉమాకాంత్ (33) సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న సమయంలో ఓ యువతి పరిచయమైంది. వారిరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఉమాకాంత్ పై చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు పిట్టి కేసులతో పాటు 2017 లో మెదక్ కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడు. ఇది ఇలా ఉండగా ఉమాకాంత్ కు అరుంధతి కాలనీ బ్రిడ్జి, రాజీవ్ గాంధీనగర్ కు చెందిన రవి స్నేహితుడు. వీరిద్దరూ తరచూ మద్యం, గంజాయి సేవించేవారు.

అయితే, అద్దెకు నివసించే రవి గదిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని ఇంటి యజమాని నర్సింహులు 100 కు డయల్ చేసి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఈ ఫిర్యాదు మేరకు దక్షిణ మండలం డిసిపి గజరావు భూపాల్, చత్రినాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉమాకాంత్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్య జరిగిన తీరుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులైన ఉమాకాంత్, రవి లు తరచూ గంజాయి, మద్యం సేవించేవారు. ఈ నేపథ్యంలోనే ఉమాకాంత్ మీర్‌పేట్ నుంచి అరుంధతి కాలనీ బ్రిడ్జి ప్రాంతంలో అద్దెకు నివసించే రవి ఇంటికి శనివారం అర్థరాత్రి వచ్చాడు. ఇద్దరూ కలిసి గంజాయి, మద్యం సేవించారు. గంజాయి మత్తులోకి చేరుకున్నాక వారి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివాదం నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన రవి తన చేతికందిన కత్తెర తీసుకుని.. ఉమాకాంత్ కడుపులో పొడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమాకాంత్ హత్య రవి గదిలో జరగడం.. రవి పరారీలో ఉండడంతో పోలీసులు అతనిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుననారు. కాగా రవి పై కూడా గతంలో అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(రిపోర్టర్: నూర్ మహమ్మద్, హైదరాబాద్, టీవీ9 తెలుగు)

Also read:

Nalgonda: నల్లగొండ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం.. పోలీసుల ఎంట్రీతో ప్రాణాలతో బయటపడ్డ యువకులు..

Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చనిపోయిన గేదెపైకి ఎక్కిన ఆటో..

సంతాన సాఫల్యానికి కొత్త జంటలు ఎందుకు దూరమవుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందా?