Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..

Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన మాయదారి కరోనా.. థర్డ్ వేవ్ రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది.

Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..
Blood Clot In Corona Patients
Follow us

|

Updated on: Aug 30, 2021 | 5:16 AM

Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన మాయదారి కరోనా.. థర్డ్ వేవ్ రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. ఈ దఫా థర్డ్ వేవ్ రూపంలో చిన్నారులపై పంజా విసురుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబైలోని మంఖుర్ద్ పరిధిలోనే 13 మంది చిన్నారులకు కరోనా సోకింది. కరోనా సోకిన చిన్నారులందరినీ వాషినాక లోని కరోనా ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారుల తెలిపారు.

ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో ఆదివారం సాయంత్రానికి కొత్తగా 4,666 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన కేసులతో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 64,56,939 లకు చేరింది. ఇక కరోనా కారణంగా ఒక్క రోజులో 131 మంది చనిపోగా.. ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,37,157 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీల సంఖ్య 62,63,416 కి చేరింది. మహారాష్ట్రలో రికవరీ రేటు 97 శాతం కాగా, మరణాల రేటు 2.12 శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో 52,844 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

జల్నా, అకోలా, యావత్మల్, నాగపూర్, వార్ధా, భండారా, గోండియా జిల్లాలు, పర్భని నగరంలో ఆదివారం ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. నాగపూర్, అకోలా డివిజన్లలో వైరస్ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇక ముంబై నగరంలో 345 కొత్త పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో, ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య 7,43,499 కి చేరగా.. మరణాల సంఖ్య 15,974 కి పెరిగింది.

Also read:

సంతాన సాఫల్యానికి కొత్త జంటలు ఎందుకు దూరమవుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందా?

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ

OU: ఉస్మానియా హాస్టల్స్ దగ్గర మంత్రి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ మోతే శ్రీలత ‘చాయ్ పే చర్చ’

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.