AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Zealand: ఫైజర్ వ్యాక్సిన్‌తో న్యూజిలాండ్‌లో తొలి మరణం.. అరుదైన సైడ్ ఎఫెక్ట్‌తో మహిళ మృతి

కరోనాపై పోరాటంలో అన్ని దేశాలకన్నా ముందున్న న్యూజిలాండ్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ మహిళ మరణించిన ఘటన ఆ దేశంలో కలకలం సృష్టించింది.

New Zealand: ఫైజర్ వ్యాక్సిన్‌తో న్యూజిలాండ్‌లో తొలి మరణం.. అరుదైన సైడ్ ఎఫెక్ట్‌తో మహిళ మృతి
Pfizer
Janardhan Veluru
|

Updated on: Aug 30, 2021 | 11:02 AM

Share

కరోనాపై పోరాటంలో అన్ని దేశాలకన్నా ముందున్న న్యూజిలాండ్‌లో జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ మహిళ మరణించిన ఘటన ఆ దేశంలో కలకలం సృష్టించింది. న్యూజిలాండ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా నమోదైన తొలి మరణం ఇది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అరుదైన సైడ్ ఎఫెక్ట్ (మయోకార్డిటిస్) కారణంగా ఓ మహిళ మరణించినట్లు భావిస్తున్నట్లు వ్యాక్సిన్ భద్రతా పర్యవేక్షణ బోర్డు వెల్లడించింది. మయోకార్డిటిస్ గుండె కండరాల వాపు వల్ల హృదయ స్పందనల్లో మార్పులకు కారణమవుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్‌తో వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఆ మహిళ వయస్సు, ఇతర అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? తదితర ఎలాంటి వివరాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడించలేదు. అయితే ఫైజర్‌పై తాము నమ్మకాన్ని కోల్పోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ దేశంలో ఫైజర్ వ్యాక్సిన్‌కు మాత్రమే ఆమోదముంది. న్యూజిలాండ్‌లో నమోదైన తొలి మరణంపై ఫైజర్ మీడియా విభాగం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆరు మాసాలు అనంతరం ఆ దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో తొలి వ్యాక్సిన్ మరణం నమోదుకావడం ఆ దేశ ప్రజలను, అధికార యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. న్యూజిలాండ్ దేశంలో సోమవారం 53 కరోనా డెల్టా వేరియంట్ కేసులు నమోదైనాయి. 50 లక్షల మంది జనాభా కలిగిన ఆ దేశంలో.. ప్రస్తుతం 560 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం 3,465 కోవిడ్ కేసులు నమోదుకాగా.. 26 మంది మరణించారు. దీంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. ఇప్పటి వరకు 30 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. దేశ జనాభాలో 23 శాతం మందికి పూర్తిగా వ్యాక్సినేట్ చేశారు.

Also Read..

దేశంలో 40 వేలకుపైగా కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు.. 70 శాతం ఆ ఒక్క రాష్ట్రంలోనే..

కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్‌ యూనిట్‌.. అపురూప ప్రేమ కథకు సాక్ష్యం ఈ ఫొటో..