Corona: దేశంలో 40 వేలకుపైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు.. 70 శాతం ఆ ఒక్క రాష్ట్రంలోనే..
Corona: భారత్‌లో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా..
Corona: భారత్‌లో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు మోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనాతో 380 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది. అలాగే ఇప్పటి వరకు మొత్తం 4,38,210 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో 34763 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు దేశంలో 3.19 కోట్ల మంది కోలుకున్నట్లు తెలిపింది. ఇక రికవరీ రేటు 97.51 శాతానికి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 3,76,324 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.15శాతంగా ఉంది. అలాగే కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మరింతగా ఉన్నాయి. నిన్న అక్కడ 29,836 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 69.5శాతం ఒక్క ఈ రాష్ట్రంలోనే బయటపడ్డాయి.
ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 31,14,696 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 63.43కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, దేశంలో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. థర్డ్‌వేవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున కేంద్ర సర్కార్ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సూచించింది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా పాజిటివ్ కేసులు బాగానే నమోదు అవుతున్నాయి. థర్డ్ వేవ్ రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. ముంబైలోని మంఖుర్ద్ పరిధిలోనే 13 మంది చిన్నారులకు కరోనా సోకింది. కరోనా సోకిన చిన్నారులందరినీ వాషినాక లోని కరోనా ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారుల తెలిపారు. మహారాష్ట్రంలో ఆదివారం సాయంత్రం నాటికి కొత్తగా 4,666 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 131 మంది మరణించారు. ఇలా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.