Corona Virus: గ్రామంలో ‘నో సెల్‌ఫోన్ సిగ్నల్స్’.. ఆన్‌లైన్‌లో చదువు కోసం శ్మశానం బాటపట్టిన ‘మెడికో విద్యార్థి’ని ఎక్కడంటే
Corona Virus-Online Classes: ప్రస్తుతం మనిషి జీవితాన్ని కోవిడ్ కు ముందు కరోనా వైరస్ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉందేమో.. చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాలను గత కొన్ని నెలలుగా వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం..
Corona Virus-Online Classes: ప్రస్తుతం మనిషి జీవితాన్ని కోవిడ్ కు ముందు కరోనా వైరస్ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉందేమో.. చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాలను గత కొన్ని నెలలుగా వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. మనుషులకు ఎవరికీ ఎవరిని కాకుండా చేసింది. ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేసింది. అయితే అన్నిటికంటే విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు కూడా. కరోనా వైరస్ నివారణ కోసం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి స్కూల్స్ మూతబడ్డాయి. విద్యార్థులకు ఆన్ లైన్ లోనే పాఠాలను బోధిస్తున్నారు టీచర్స్.. అయితే పట్టణాల్లో నగరాల్లో ఆన్ క్లాసెస్ నిర్వహణకు.. వారికీ హాజరుకావడానికి విద్యార్థులు పెద్దగా ఇబ్బందులు పడడం లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు మాత్రం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెట్ సిగ్నల్స్ లేకపోవడంతో పాటు, విద్యుత్ సమస్యలు కూడా పల్లెల్లోని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే గతంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో సిగ్నల్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు కొండప్రాంతానికి వెళ్లి ఆన్‌లైన్ కాసులకు హాజరవుతున్న ఫోటోలు గత నెలలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆ వంతు తెలంగాణ కు వచ్చింది. వివరాల్లోకి ..
జగిత్యాల జిల్లాలో ల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన స్వగ్రామంలో సిగ్నల్స్ లేకపోవడంతో సమీపంలోని శ్మశానవాటికకు వచ్చి ఆన్‌లైన్ క్లాసులు వింటుంది . ప్రస్తుతం ఈ మెడికల్ స్టూడెంట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్పన 2017 లో ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. ఊర్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉంది. అయితే క్లాసెస్ఈ కు హాజరుకావాల్సి ఉంది. దీంతో కల్పన నిత్యం శ్మశానవాటిక వద్దకు వచ్చి ఆన్ లైన్ క్లాసులను వింటుంది. ఇదే విషయంపై కల్పన స్పందిస్తూ.. తనకు కుటుంబసభ్యుల సహకారం ఇస్తున్నారని..అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసుల కోసం ఇబ్బంది పడుతున్న తనలాంటి వారి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని.. సిగ్నల్స్ వచ్చే చేయాలని కోరుతుంది.
Also Read: Krishnashtami 2021: కరోనా నిబంధనల నడుమ కృష్ణాష్టమి వేడుకలు.. దేశవ్యాప్తంగా ముస్తాబైన కన్నయ్య ఆలయాలు..