Krishnashtami 2021: కరోనా నిబంధనల నడుమ కృష్ణాష్టమి వేడుకలు.. దేశవ్యాప్తంగా ముస్తాబైన కన్నయ్య ఆలయాలు..
Krishnashtami 2021: కృష్ణాష్టమి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ..కన్నయ్య జయంతి వేడుకలకు ఏర్పాట్లు..
Krishnashtami 2021: కృష్ణాష్టమి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ..కన్నయ్య జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దేశవిదేశాల్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ గోకులాష్టమి వేడుకలకు ముస్తాబవుతున్నాయి.
మన దేశంలో ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క రూపంగా భావించి కృష్ణుడిని పూజిస్తారు. దేశంలోని ఇస్కాన్ ఆలయాలతో పాటు.. గల్లీ గల్లీ లో కృష్ణుడు పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. ఇక ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే కరోనా నిబంధనలతో వేడుకలకు రంగం సిద్ధం చేశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆ రోజున గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలను అందుకుంటుంది.
శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. సర్వ భూపాల వాహనంపై శ్రీకృష్ణ స్వామి వారిని ఆహ్వానించి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు.
కృష్ణాష్టమి మర్నాడు తిరుమలలో ఉట్లోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా క్రీ.శ.1545 సంవత్సరంలో తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
మరోవైపు దేశంలోని కృష్ణుడి ఆలయాలతో పాటు, ఇస్కాన్ ఆలయాల్లో ఘనంగా వేడుకలునిర్వహించనున్నారు. ఇప్పటికే కృష్ణయ్య ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇస్కాన్ ఆలయాల్లో చిన్ని కృష్ణయ్య కు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలవనున్నాయి. కృష్ణ జయంతి రోజున గ్రామోత్సవం, గీతాపఠనం, ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. అయితే ఈ సారి వేడుకలకు అధికారులు కొన్ని నిబంధనలు విధించారు.
Also Read: Yoga Pose: దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. రిలీఫ్ కోసం ఉదయాన్నే ఈ ఆసనాన్ని ట్రై చేయండి