Yoga Pose: దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. రిలీఫ్ కోసం ఉదయాన్నే ఈ ఆసనాన్ని ట్రై చేయండి
Nadi Shodhana Pranayama: ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన అద్భుత వరం యోగా. ఇది చాలా ఉపయోగకరమైన, ఆరోగ్యకరమైన వ్యాయామం. యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు..
Nadi Shodhana Pranayama: ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన అద్భుత వరం యోగా. ఇది చాలా ఉపయోగకరమైన, ఆరోగ్యకరమైన వ్యాయామం. యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు చాలా మంచిది. యోగా తో శరీరానికి కొత్త శక్తి వస్తుంది. ముఖ్యంగా ఉదయమే నిద్రలేచిన వెంటనే పరగడుపున యోగా వల్ల చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలున్నాయి. యోగా శరీరం బరువు తగ్గడానికిమాత్రమే కాదు.. అనేక వ్యాధుల నుంచి విముక్తిని కూడా కలిగిస్తుంది. వ్యాధులతో పోరాడటానికి ఈ యోగా.. వ్యాయామ రూపంలో పురాతన కాలం నుంచే భారతదేశంలో ప్రారంభమైనది. ఈ యోగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం ఫిట్ గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అయితే ఒకొక్క యోగాసనం ఒకొక్క ప్రాధాన్యతను కలిగి ఉంది. దీర్ఘకాలిక వ్యాధులనుంచి ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. ఈరోజు శ్వాస సంబంధం వ్యాధులనుంచి నివారణ కలిగించే నదిషోధన యోగాసనం గురించి తెలుసుకుందాం..!
ముందుగా పద్మాసనంలో కూర్చుని శ్వాసమీద దృష్టి పెట్టాలి. కొని నిమిషాల పాటు సాధారణ శ్వాస తీసుకోవాలి. అనంతరం గయన్ ముద్ర అంటే కుడి లేదా ఎడమ చేతి చూపుడు వేలుతో బొటవేలి కులపుతూ.. మిగిలిన మూడు వేళ్ళను దూరం ఉంచి ముక్కును పట్టుకోవాలి. ఒక ముక్కు రంధ్రాన్ని చేతి వేళ్ళతో మూసి.. రెండో ముక్కు రంధ్రంతో దీర్ఘ శ్వాస తీసుకోవాలి. నిధానంగా శ్వాసని తీసుకుంటూ పొట్టని బిగపట్టాలి. అనంతరం శ్వాసను నియంత్రిస్తూ.. ఒక పది నెంబర్లు లెక్కపెట్టుకుని అపుడు నెమ్మదిగా శ్వాసను వదిలివేయాలి. ఇలా రెండు ముక్కు రంధ్రాల నుంచి ఒకదాని తర్వాత ఒకటి గాఢంగా శ్వాస తీసుకుని.. వదలడం చేయాలి. ఇలా ఉదయమే రోజూ ఐదు నుంచి ఆరు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నదిషోధన ప్రాణాయామం వలన ఉపయోగాలు:
* శరీరంలోని కండరాలకు, ఊపిరితిత్తులకు మంచి ఎనర్జీని ఇస్తుంది. *శ్వాస సంబంధిత సమస్యలునివారింపడతాయి. * టైడల్ వాల్యూమ్ పెరుగుతుంది. * నాడీవ్యవస్థను బలంగా తయారు చేస్తుంది. * మానసిక ప్రశాంతను ఇస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. *శరీరంలోని అవయవాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది. * మెదడులోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. * శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది.
Also Read: