Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips : మోచేతులు.. మోకాళ్లు నల్లగా ఉన్నాయా? అయితే ఈ టిప్స్‌తో వైట్‌గా చేసుకోండి..

Skin Care Tips : చాలామంది ముఖారవిందంపై దృష్టి పెట్టినట్లుగా.. శరీరంలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టరు. ఈ నిర్లక్ష్యం కారణంగా.. శరీరంలోని ఇతర భాగాలలో

Skin Care Tips : మోచేతులు.. మోకాళ్లు నల్లగా ఉన్నాయా? అయితే ఈ టిప్స్‌తో వైట్‌గా చేసుకోండి..
Skin Care
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2021 | 6:13 AM

Skin Care Tips : చాలామంది ముఖారవిందంపై దృష్టి పెట్టినట్లుగా.. శరీరంలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టరు. ఈ నిర్లక్ష్యం కారణంగా.. శరీరంలోని ఇతర భాగాలలో ముఖ్యంగా మోచేయి, మోకాలి భాగంలో నల్లగా కనిపిస్తుంటుంది. ఈ ప్రదేశాలలో చర్మం మందంగా ఉంటుంది. ఆ కారణంగా మృత చర్మం పొర అలాగే అక్కడ పేరుకుపోతోంది. అలా ఆ ప్రాంతం అంతా అందవికారంగా ఉంటుంది. అయితే, ఈ ప్రదేశాలలో ఆయిల్ గ్లేడ్స్ లేనందున.. చర్మం త్వరగా పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అందుకే.. ఈ ప్రదేశాలపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. మోచేతులు, మోకాళ్ల వద్ద చర్మం నల్లదనాన్ని పోగొట్టాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా మోకాలు, మోచేతుల నలుపు తొలగిపోతుంది. ఇందులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది నలుపును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెను వారానికి 2 నుండి 3 రోజులు ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం తొలగిపోతుంది.

నిమ్మకాయ: నిమ్మకాయ చర్మంపై సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం రంగును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం రంగును కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే.. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు నేరుగా మోచేతులు, మోకాళ్లపై పెరుగును అప్లై చేయొచ్చు. పెరుగును మోచేతులు, మోకాళ్లకు అప్లై చేసి.. కొంతసేపు ఉంచి, తర్వాత నీటితో కడగాలి.

నారింజ తొక్క: మోచేతులు, మోకాళ్ల నలుపును పోగొట్టడానికి ఆరెంజ్ తొక్క బాగా సహాయపడుతుంది. దీని కోసం, పొట్టును ఎండలో ఆరబెట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌కి కొద్దిగా పాలు, రోజ్ వాటర్ కలపాలి. ఈ పేస్ట్‌ని నల్లబడిన ప్రదేశంలో అప్లై చేసి, కొంత సమయం తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప: మోచేతులు, మోకాళ్ల నలుపును తొలగించడానికి బంగాళాదుంప చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, మీరు బంగాళాదుంప ముక్కను మోచేతులు, మోకాళ్లపై సుమారు 5 నిమిషాలు రుద్దాలి. ఆపై నీటితో కడగాలి. ఈ రెమెడీని రోజుకు రెండుసార్లు చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది.

దోసకాయ: దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం, దోసకాయ రసంలో పసుపు కలపి చిక్కటి పేస్ట్‌ని రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మోచేతులు మరియు మోకాళ్లపై అప్లై చేసి, అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Also read:

Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..

Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..