Telangana: షాకింగ్.. మహిళను పొడిచిన బర్రె… కొమ్ములపైన శవంతో రాత్రంతా తిరుగుతూ..

ఆ వృద్ధ మహిళ పగలంతా పనులు చేసి.. రాత్రి ఘాడమైన నిద్రలో ఉంది. ఇంతలో ప్రమాదం బర్రె రూపంలో దూసుకువచ్చింది. నోరు లేని  ఆ జీవం వృద్ధురాలి ప్రాణాలు...

Telangana: షాకింగ్..  మహిళను పొడిచిన బర్రె... కొమ్ములపైన శవంతో రాత్రంతా తిరుగుతూ..
Buffalo
Follow us

|

Updated on: Aug 29, 2021 | 4:48 PM

ఆ వృద్ధ మహిళ పగలంతా పనులు చేసి.. రాత్రి ఘాడమైన నిద్రలో ఉంది. ఇంతలో ప్రమాదం బర్రె రూపంలో దూసుకువచ్చింది. నోరు లేని  ఆ జీవం వృద్ధురాలి ప్రాణాలు తీసింది. ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకొచ్చిన బర్రె.. నిద్రపోతున్న మహిళపై దాడి చేసింది. కొమ్ములతో పొడిచింది. దీంతో ఆమె స్పాట్‌లోనే మరణించింది. కాగా సదరు మహిళ మృతదేహం బర్రె కొమ్ముల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆ గేదె రాత్రంతా వృద్ధురాలి మృతదేహంతోనే ఊరంతా కలియ తిరిగింది. తెల్లవారుజామున బర్రె కొమ్ములకి వృద్ధురాలు వేలాడుతుండడం చూసి గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. ఈ దారుణ ఘటన నారాయణపేట్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మాగనూర్ మండల కేంద్రానికి చెందిన బోయ లక్ష్మమ్మ(75) ఒంటరిగా ఓ గుడిసెలో నివాసముంటోంది. రోజూ మాదిరిగానే రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి సమయంలో గుడిసెలో చొరబడిన ఓ బర్రె లక్ష్మమ్మను కొమ్ములతో పొడిచేయడంతో ఆమె అక్కడే మరణించింది. ఆమె మృతదేహం కొమ్ములకే ఇరుక్కుపోయింది. డెడ్‌బాడీతోనే బర్రె రాత్రంతా ఊళ్లో తిరిగింది. గమనించిన స్థానికులు బర్రె కొమ్ములకు లక్ష్మమ్మ మృతదేహాన్ని చూసి భయాందోళనలకు లోనయ్యారు. ఆమె మృతదేహం ఛిద్రమైంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తల్లి మందలించిందని… పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య

నల్గొండ జిల్లాకు చెందిన పదోతరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఫోన్​ ఎక్కువగా వాడుతుందని తల్లి మందలింపుతో ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన కావ్య.. టెన్త్ క్లాస్ చదువుతోంది. లాక్​డౌన్​ కారణంగా స్కూల్ లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటోంది. ఈ మధ్యకాలంలో ఫోన్​ ఎక్కువగా చూస్తుందని.. గుర్తించిన ఆమె తల్లి తిట్టింది. మనస్తాపం చెందిన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు హుటాహుటిన నల్గొండ ఏరియా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ తీసుకెళ్లాలని డాక్టర్ల సూచనలతో ఎల్బీనగర్​లోని ఓ ప్రైవేటు​ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని శనివారం రాత్రి 12గంటల సమయంలో మృతి చెందింది. కాగా డాక్టర్ల నిర్లక్షంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చికిత్స కోసం రూ.3లక్షలు తీసుకున్నడాక్టర్లు సరైన చికిత్స అందించలేదని.. ప్రాణాలు నిలబెడతారనుకుంటే ప్రాణం తీశారని ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Also Read: మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం.. పోలీసులు పక్కన ఉన్నా కూడా ఎంత తెలివిగా కొట్టేశారో చూడండి

 తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి మోగనున్న స్కూల్ బెల్స్.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై ఓవర్ వ్యూ