Telangana Schools: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి మోగనున్న స్కూల్ బెల్స్.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై ఓవర్ వ్యూ

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు బడులు తెరుచుకోబోతున్నాయి. పిల్లలంతా బ్యాగ్‌లు భుజన వేసుకొని.. బడిబాట పట్టబోతున్నారు. ఈ క్రమంలో...

Telangana Schools: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి మోగనున్న స్కూల్ బెల్స్.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై ఓవర్ వ్యూ
Telangana Schools
Follow us

|

Updated on: Aug 29, 2021 | 1:03 PM

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు బడులు తెరుచుకోబోతున్నాయి. పిల్లలంతా బ్యాగ్‌లు భుజన వేసుకొని.. బడిబాట పట్టబోతున్నారు. ఈ క్రమంలో పిల్లలు వెళ్లి చదువుకునేందుకు అనువుగా ఉన్నాయా అంటే.. సర్కారు బడుల్లో మాత్రం సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఏడాదిన్నర కాలంగా..చెత్త ఎత్తలేదు, మరమ్మత్తులు చేపట్టలేదు. అంతే స్కూల్ ప్రాంగాణాలన్ని పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. మరమ్మతులు చేపట్టని కారణంగా భవనాలన్ని శిథిలావస్తకు చేరాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఏడాదిన్నరగా మూసి ఉండడంతో కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 3,162 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. స్కూల్స్‌ను శుభ్రం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినా.. అది పంతుళ్లకు పెద్ద చాలెంజింగ్‌గా మారింది. ఎక్కడికక్కడ తుప్పలు పేరుకుపోవడంతో.. వాటి తొలగింపు కష్టసాధ్యంగా మారింది.

ప్రతి ఒక్కరి విధిగా మాస్క్ ధరించాలి, అదే సమయంలో ఫ్రిక్వెంట్‌గా శానిటైజ్ చేసుకోవాలన్నది ప్రభుత్వ ఆదేశం. ఇదంతా ఎలా ఉన్నా? ఒకసారి అన్ని తరగతులకు క్లాస్‌ల ప్రారంభం అంటే చాలెంజింగే అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. విడతల వారిగా ప్రారంభిస్తే బాగుండేదని స్పష్టం చేస్తున్నారు.పిల్లలను బడికి పంపాలన్న ఆతృత ఉన్నా.. భద్రత మాటేంటి? అన్న ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. ముళ్ల పొదలు, శిథిలావస్థకు చేరిన భవనాల కింద.. విద్యార్థుల భద్రత ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. మెజారిటీ గ్రామాల్లో సర్కార్ బడులను శుభ్రం చేస్తున్నా బాత్రూం లు క్లీన్ చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదు. గ్రామపంచాయితీలో ఈ పనిచేయడానికి ఎవరు లేకపోవడం, ఉన్న సిబ్బంది ససేమిరా అనడం పెద్ద సమస్యగా మారింది. గతంలో ఉండే శప్రశి వ్యవస్థను ప్రభుత్వం తొలగించింది. స్కూల్ టాయిలెట్స్ ఎవరు క్లీన్ చేయాలనేది ప్రశ్నార్ధకంగా మారింది.

ఇక నల్గొండ జిల్లాలో సర్కారు బడులు సమస్యల లోగిళ్లుగా మారాయి. కరోనా ప్రభావంతో ఇన్నాళ్లు.. విద్యార్థులు బడులకు దూరంగా ఉన్నారు. కోటి ఆశలతో బడికి సిద్ధమైన విద్యార్థులను సమస్యలు వేధిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2287 ప్రాథమిక పాఠశాలలు, 227 ప్రాథమికోన్నత పాఠశాలలు, 560 జెడ్పీ హెచ్‌ఎస్‌లు, 78 రెసిడెన్షియల్ పాఠశాలలు, 33 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. 2 లక్షల 88 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో భవనాలు పెచ్చులూడటానికి సిద్ధంగా ఉన్నాయి. స్లాబ్‌లో తేలిన ఇనుప చువ్వలకే ఫ్యాన్లు అమర్చారు. కిటికీలు.. గాలికి ఎప్పుడు మీద పడుతాయే తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పిల్లలు బడిబాట పడుతారా? మరి అక్కడ వారి భద్రత ఏంటన్నది పెద్ద చాలెంజింగ్‌గా మారింది. చెత్తను తొలగించవచ్చు, ముళ్లపొదలనూ తీసేయవచ్చు. పెచ్చులూడిన భవనాల సంగతేంటి? కూలడానికి సిద్ధంగా ఉన్న శ్లాబ్‌ల కింద విద్యార్థులకు భద్రత ఎంత? ఇలాంటి ప్రశ్నలు.. అంతకు మించిన సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి.

Also Read: హాస్టల్ గదిలో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య.. తెల్లారితే ఇంటికి వెళ్లాలనగా

పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్ .. కూపీ లాగగా నిజాలు తెలిసి విస్తుపోయిన పోలీసులు

Latest Articles
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం