YSR Death Anniversary: వైఎస్ క్యాబినెట్ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం.. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి రోజున హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులు, రాజకీయ సహచరులను విజయమ్మ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తోపాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులను విజయమ్మ ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.
12వ వర్ధంతి సందర్భంగా..
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న ఆయన సతీమణి విజయమ్మ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ కె.ఆర్ సురేష్‌రెడ్డి తదితరులతోపాటు వై.ఎస్.మంత్రివర్గంలో పనిచేసిన వారిని, రాజకీయ సహచరులను, శ్రేయోభిలాషులను విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..