TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..

ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం. నరరూప రాక్షసుల అడ్డాలో.. ప్రాణాలకు తెగించి.. టీవీ9 టీమ్‌ డేరింగ్‌ రిపోర్టింగ్‌ చేసింది. ఆఫ్గన్‌లో మారణహోమానికి అసలు కారణాలపై.. అన్ని కోణాలపై దృష్టి పెట్టింది....

TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..
Tv9 Exclusive With Taliban
Follow us

|

Updated on: Aug 29, 2021 | 7:11 AM

ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం. నరరూప రాక్షసుల అడ్డాలో.. ప్రాణాలకు తెగించి.. టీవీ9 టీమ్‌ డేరింగ్‌ రిపోర్టింగ్‌ చేసింది. ఆఫ్గన్‌లో మారణహోమానికి అసలు కారణాలపై.. అన్ని కోణాలపై దృష్టి పెట్టింది. కాబూల్‌ పేలుడు తర్వాత తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ టీవీ-9 భారత్‌వర్ష్‌తో మాట్లాడారు. భారత్‌​సహా ఇతర దేశాలతో తాలిబన్లు సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ చెప్పారు. భారత్‌తో స్నేహపూరిత సంబంధాలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

కశ్మీర్‌ అంశాన్ని భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అఫ్గాన్ మట్టిని మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి తాము అనుమతించబోమని సుహైల్‌ షాహీన్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold Bag: ప్రైవేట్ బస్సులో 2 కిలోల బంగారు బ్యాగుతో వచ్చిన వ్యక్తి.. తీరా హైదరాబాద్ చేరుకోగానే షాక్..!