Gold Bag: ప్రైవేట్ బస్సులో 2 కిలోల బంగారు బ్యాగుతో వచ్చిన వ్యక్తి.. తీరా హైదరాబాద్ చేరుకోగానే షాక్..!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Aug 28, 2021 | 6:38 PM

Hyderabad Gold Bag Missing : ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారికి చెందిన 2.1కిలోల బంగారు అభరణాల బ్యాగు కనిపించకుండాపోయింది.

Gold Bag: ప్రైవేట్ బస్సులో 2 కిలోల బంగారు బ్యాగుతో వచ్చిన వ్యక్తి.. తీరా హైదరాబాద్ చేరుకోగానే షాక్..!
Gold Bag

Hyderabad Gold Bag Missing: ప్రైవేట్ బస్సులో 2.1కిలోల బంగారు అభరణాల బ్యాగు కనిపించకుండాపోయింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న వ్యక్తికి చెందిన బంగారు ఆభరణాలు ఉన్న తన బ్యాగ్ కనిపించకుండా పోయిందని బంగారు వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తుండగా బంగారం మాయ‌మైందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ముంబైలోని ఓ ప్రముఖ జ్యువెల‌రీ షాపులో ప‌ని చేస్తున్న గులాబ్ మాలిక్ (32) వ్యాపారం నిమిత్తం 2.1 కిలోల బంగారాన్ని తీసుకుని హైద‌రాబాద్‌కు ప్రైవేటు బ‌స్సులో పయనమయ్యాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆ బ‌స్సు అమీర్‌పేట‌కు చేరుకుంది.

మంగళవారం నగరంలోని అమీర్‌పేట్ వద్ద మాలిక్ బస్సు నుండి దిగిన తర్వాత తన లగేజీ కోసం తనిఖీ చేసినప్పుడు, ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. దీంతో అతను వెంటనే తన యజమాని శ్రావణ్ గెహ్లాట్‌కు సమాచారం అందించాడు. అతను నగరానికి వచ్చి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసి, అధికార పరిధి ఆధారంగా కేసును పంజాగుట్టకు బదిలీ చేశారు.ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముంబై, రాజస్థాన్‌లకు పంపారు. అక్కడ వారు మాలిక్ బస్సు ఎక్కే ప్రదేశం నుండి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ముంబైలో లేదా మహారాష్ట్రలో బంగారం దొంగిలించి ఉంటారని, హైదరాబాద్‌కు అభరణాలు చేరుకోలేదని పోలీసుు అనుమానిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Read Also… Cycles in Metro Rail: ఇక, మెట్రో రైళ్లల్లో సైకిళ్లను తీసుకెళ్లవచ్చు.. ట్రయల్ రన్ సక్సెస్.. ఎక్కడంటే..?

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో 200పైగా కేసులు నమోదు..!

కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి మండపం ఎక్కనంటూ నవ వధువు ఏడుపు.. అసలేం జరిగిందంటే..?? వీడియో

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu