Cycles in Metro Rail: ఇక, మెట్రో రైళ్లల్లో సైకిళ్లను తీసుకెళ్లవచ్చు.. ట్రయల్ రన్ సక్సెస్.. ఎక్కడంటే..?
Cycles in Pune Metro Rail: పుణె మెట్రో ప్రాజెక్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, రైళ్లల్లో సైకిళ్లను తీసుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
Pune Metro Rail Board: పుణె మెట్రో ప్రాజెక్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, రైళ్లల్లో సైకిళ్లను తీసుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పుణె మెట్రో ప్రాజెక్టును అమలు చేస్తున్న మహా-మెట్రో, సంత్ తుకారామ్ నగర్, ఫుగేవాడి స్టేషన్ల మధ్య మెట్రో రైలులో సైకిళ్లతో గురువారం ట్రయల్ రన్ నిర్వహించింది. పుణే మెట్రోలో ప్రయాణించేవారు ఇకపై తమ వెంట సైకిళ్లను కూడా తీసుకువెళ్లవచ్చని మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ వెల్లడించారు. దీంతో మెట్రో రైలులో ప్రయాణించిన తరువాత ఆటోలు, బస్సుల కోసం వేచిచూడాల్సిన అవసరముండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎంతోమందికి మేలు చేకూరుస్తుందని తెలిపారు. సైకిళ్ల కారణంగా పర్యావరణానికి హాని జరగకపోవడమే గాక రోడ్లపై ట్రాఫిక్ కూడా తగ్గుందని వివరించారు.
సాధారణంగా ప్రజలు మెట్రో స్టేషన్‌కు రావాలన్నా, ఇక్కడి నుంచి వేరేచోటికి వెళ్లాలన్నా ఆటోలు, బస్సులను ఆశ్రయిస్తారు. దీని కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ పెరగడంతో పాటు ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అలాంటి వారు తమ వెంట సైకిల్ తెచ్చుకుంటే మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలన్నా, రైలు దిగిన తరువాత తమ గమ్యస్థానాలకు వెళ్లాలన్నా సైకిళ్లు ఎంతో దోహద పడతాయని బ్రిజేష్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.
“ఒకప్పుడు, పూణే సైకిల్ వినియోగదారుల నగరంగా ‘సిటీ ఆఫ్ సైకిల్స్’గా పేరొందింది. గత కొన్ని సంవత్సరాలుగా బలమైన ప్రజా రవాణా అందుబాటులో లేనందున, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వినియోగం అసమానంగా పెరిగింది. ఇది అనియంత్రిత వాహనాల జనాభా, ట్రాఫిక్‌లో రద్దీ, కాలుష్యం, ప్రయాణ వ్యయం, ప్రయాణానికి ఎక్కువ సమయంపడుతోంది. దీంతో మహా-మెట్రో సైకిళ్లను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. తద్వారా పూణే మళ్లీ దాని వైభవానికి చేరుకుంటుందని పుణె పురపాలిక అధికారులు అభిప్రాయపడ్డారు.
Dr. Dixit, MD #MahaMetro lead by an example along with the various officials of #PuneMetro by carrying bicycles into metro train & travelled from Phugewadi to Sant Tukaram Nagar stations & return.This might help to revive glory of #Pune & #PCMC as #CityofCycles.#EcoFriendly pic.twitter.com/XONW2qlMVZ
— Pune Metro Rail Project (@metrorailpune) August 26, 2021