EGG: డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు.. ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే.. కొత్త స్టడీలో..
మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో మతిమరుపు కూడా ఒకటి. అయితే ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా మంది అనేక రకాల మందులను ఉపయోగిస్తున్నారు. కానీ ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? అవును మనం రోజూ ఒక గుడ్డు తినడం వల్ల మతిమరుపు సమస్యను 27 శాతం తగ్గించుకోవచ్చని తాజా పరిశోదనలు చెబుతున్నాయి. అదెలానో చూద్దాం పదంది.

అల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి. మన దేశంలో లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో పరిశోదకులు ఒక కొత్త పరిష్కారాన్ని కనిపెట్టారు. మన రోజువారి ఆహారంలో భాగమైన గుడ్డు ఈ వ్యాధిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వారు తెలుసుకున్నారు.
కొత్త స్టడీ ఏం చెబుతోంది
కాలిఫోర్నియాలోని ‘లోమా లిండా యూనివర్సిటీ హెల్త్’ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ప్రకారం.. వారంలో కనీసం ఐదు రోజుల పాటు డేలీ ఒక గుడ్డు తినే వారిని.. అస్సలు తినని లేదా చాలా అరుదుగా తినే వారితో పోలిస్తే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం 27 శాతం తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. ఇది పరిశోదకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సులువైన, చౌకైన, రుచికరమైన మార్గం.
అల్జీమర్స్ తగ్గాలంటే ఎన్ని గుడ్లు తినాలి
గుడ్లు తినే ఫ్రీక్వెన్సీకి, అల్జీమర్స్ ముప్పు తగ్గడానికి మధ్య స్పష్టమైన సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు గుడ్లు తినే వారికి ఈ ప్రమాదం 27 శాతం తగ్గిందని తెలుసుకున్నారు. వారానికి 2 నుండి 4 సార్లు తినే వారికి 20 శాతం ముప్పు తగ్గిందని.. నెలలో 1 నుండి 3 సార్లు మాత్రమే తినే వారికి కూడా 17 శాతం ముప్పు తగ్గినట్లు అధ్యయణంలో తేలింది.
మెదడుకు మేలు చేసే అద్భుత పోషకాలు
గుడ్డులో మెదడు పనితీరును మెరుగుపరిచే, దానికి రక్షణ నిచ్చే అనేక శక్తివంతమైన పోషకాలు ఉన్నట్టు పరిశోదకులు గుర్తించారు. ఇందులో ఉండే కోలిన్.. జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యానికి అవసరమయ్యే ఎసిటైల్కోలిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్‌ను, మెదడు పనితీరును మెరుగుపరిచే ‘ఫాస్ఫాటిడైల్కోలిన్’ను తయారు చేయడంలో సహాయపడుతుందని తెలుసుకున్నారు. గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాల్లో 39 శాతం ఈ కోలిన్ వల్లే జరుగుతుందని అధ్యయనం పేర్కొంది. అలాగే గుడ్డులో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ రిసెప్టర్లు సక్రమంగా పనిచేయడానికి ఎంతో సహాయపడుతాయి.
Note: ఈ పరిశోధన కేవలం గుడ్లు తినడానికి, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న ‘సంబంధాన్ని’ మాత్రమే చూపిస్తుంది కానీ, గుడ్డు తినడం వల్లే అల్జీమర్స్ పూర్తిగా తగ్గిపోతుందని ఖచ్చితంగా చెప్పలేము.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
