AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. హిట్‌మ్యాన్‌కు జోడీగా బుడ్డోడు.. సరికొత్త ఓపెనర్స్‌తో బరిలోకి టీమిండియా..?

Vaibhav Sooryavanshi, Rohit Sharma: 15 ఏళ్ల వయసులోనే దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్తులో భారత జట్టుకు ఒక అద్భుతమైన ఆస్తిగా మారతాడనడంలో సందేహం లేదు. మరి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఫరూఖ్ ఇంజనీర్ సూచనను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాలి.

ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. హిట్‌మ్యాన్‌కు జోడీగా బుడ్డోడు.. సరికొత్త ఓపెనర్స్‌తో బరిలోకి టీమిండియా..?
Team India Vaibhav Sooryavanshi, Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jul 27, 2026 | 4:20 PM

Share

Vaibhav Sooryavanshi, Rohit Sharma: భారత క్రికెట్ వర్గాల్లో పదిహేనేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. జింబాబ్వే టూర్‌లో అదరగొట్టిన ఈ టీనేజ్ సెన్సేషన్‌ను 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దించాలని మాజీ దిగ్గజం ఫరూఖ్ ఇంజనీర్ సంచలన సూచన చేశారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఆ లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అదుర్స్..

వన్డే ప్రపంచకప్ 2027 టార్గెట్‌గా టీమిండియా సన్నాహాలు మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫరూఖ్ ఇంజనీర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం భారత వన్డే జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వ్యూహాన్ని మార్చాలని ఆయన సూచించారు. గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాట వాస్తవమే అయినా.. అతడిని నాలుగో స్థానంలో ఆడిస్తే జట్టుకు మరింత మేలు జరుగుతుందన్నది ఫరూఖ్ అభిప్రాయం. గిల్ గాల్లోకి లేపి భారీ షాట్లు ఆడే రకం కాదు.. అతడో పక్కా క్లాస్ ప్లేయర్ కాబట్టి అతనికి మిడిలార్డర్ బాధ్యతలు అప్పగించాలన్నారు.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

అదే జరిగితే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. మైదానంలో ఈ లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అద్భుతంగా వర్కవుట్ అవుతుందని ఆయన విశ్లేషించారు. వైభవ్ లాంటి దూకుడున్న ఆటగాడు పవర్‌ప్లేలో ఫీల్డింగ్ గ్యాప్స్ సునాయాసంగా కనుక్కుని బౌండరీలు బాదగలడు. అతడు ఆరంభంలోనే వేగంగా పరుగులు రాబడితే.. మిగతా బ్యాటర్లు కుదురుకుని భారీ లక్ష్యాలను నిర్దేశించడానికి పుష్కలంగా సమయం దొరుకుతుంది.

గిల్ నాలుగో స్థానానికి.. కోహ్లీ యథాతథం..

ఫరూఖ్ సూచించిన కొత్త బ్యాటింగ్ లైనప్ ప్రకారం.. రోహిత్, సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తే.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తనకిష్టమైన మూడో స్థానంలోనే వస్తాడు. ఆ తర్వాత నాలుగో నంబర్‌లో శుభ్‌మన్ గిల్ వస్తే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా మారుతుంది. పటిష్టమైన బేస్ ఏర్పడ్డాక మిడిలార్డర్‌లో గిల్ లాంటి సాంకేతిక నైపుణ్యం ఉన్న బ్యాటర్ ఉంటే జట్టుకు తిరుగుండదని ఫరూఖ్ అంచనా వేస్తున్నారు.

వన్డే జట్టులోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయం..

ఇటీవలే జింబాబ్వేతో ముగిసిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైభవ్ ఏ స్థాయిలో చెలరేగాడో అందరం చూశాం. రెండు అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించి మొత్తం 151 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం సొంతం చేసుకుని సెలెక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షించాడు. ఇలాంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కుర్రాడిని వెంటనే వన్డే జట్టులోకి తీసుకోవడానికి ఇదే సరైన తరుణమని మాజీ వికెట్ కీపర్ గట్టిగా చెబుతున్నారు. అతడి వయసు కేవలం 15 ఏళ్లే అయినా.. జాతీయ జట్టు తరఫున మ్యాచ్‌లు గెలిపించేంత ఆత్మవిశ్వాసం ఆ కుర్రాడిలో పుష్కలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేలు, టీ20ల మధ్య పెద్దగా తేడా చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

వివ్ రిచర్డ్స్ లాంటి జీనియస్.. అతన్ని మార్చకండి..!

వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. అతడిని క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో పోల్చారు. రిచర్డ్స్ ఏ ఫార్మాట్లో ఆడినా బౌలర్లపై విరుచుకుపడేవాడు.. అచ్చం అలాగే వైభవ్ కూడా ఒక జీనియస్ అని కొనియాడారు. షార్ట్ పిచ్ బంతులు పడితే వాటిని కచ్చితంగా సిక్సర్లుగా మలిచే సత్తా ఈ కుర్రాడి సొంతం. అయితే అతడికి అతిగా కోచింగ్ ఇచ్చి సహజ సిద్ధమైన శైలిని నాశనం చేయొద్దని బీసీసీఐకి సూచించారు. పుస్తకాల్లో ఉన్నట్లు కాకుండా తనదైన శైలిలో ఆడే ఈ కుర్రాడికి పదే పదే సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరుచుకునే లక్షణం అతడిలో ఉందని ప్రశంసించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం..350 ఏళ్లుగా ఇదే తంతు
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం..350 ఏళ్లుగా ఇదే తంతు
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర