AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యా.. భర్త.. మధ్యలో చేపల కూర.. టేస్టీగా లేదని తిట్టినందుకు ఎంత పనాయే..

తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల కూర రుచిగా లేదంటూ భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన నాలుగు నెలల గర్భిణీ మాధురి విశ్వకర్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దంపతులు సెరికల్చర్ పనుల కోసం తమిళనాడుకు వచ్చి పనిచేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భార్యా.. భర్త.. మధ్యలో చేపల కూర.. టేస్టీగా లేదని తిట్టినందుకు ఎంత పనాయే..
Fish Curry ArgumentImage Credit source: AI Photo
Shaik Madar Saheb
|

Updated on: Jun 11, 2026 | 6:04 PM

Share

ఇష్టంగా తిందామని భర్త చేపలు తెచ్చాడు.. గర్భిణీ అయిన తన భార్య వంట చేసింది.. అనంతరం భర్త తినడానికి వచ్చాడు.. తింటూ.. చేపల కూర రుచిగా చేయలేదని భర్త భార్యను తిట్టాడు.. దీందో మనస్తాపం చెందిన గర్భిణీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.. నామక్కల్ పరమతివెల్లూరు సమీపంలో ఉన్న ఓలపాలయం పంచాయతీలోని కళిమేడు ప్రాంతానికి చెందిన రైతు నవలాడి నాచియప్పన్ గత కొన్నెళ్ల నుంచి పట్టు పురుగుల పెంపకం చేస్తున్నాడు.. సెరికల్చర్ (Sericulture) పనుల కోసం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన తిలక్‌నాయక్, అతని భార్య మాధురి విశ్వకర్మ (20 సంవత్సరాలు) గత 6 నెలల్లో నవలాడి నాచియప్పన్ వద్ద పనిలో చేరారు.

అయితే.. తిలక్‌నాయక్ – మాధురి విశ్వకర్మ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.. ఈ క్రమంలోనే.. రైతు దగ్గర పనికి కుదిరారు.. ఆ భార్యాభర్తలు తోటలో పట్టు గూళ్లను సేకరించే పనిలో నిమగ్నమై అక్కడే ఉండేవారు. మాధురి విశ్వకర్మ ప్రస్తుతం 4 నెలల గర్భవతిగా ఉన్నారు. ఈ పరిస్థితిలో, తిలక్‌నాయక్ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేస్తూ.. “చేపల కూర ఎందుకు రుచిగా చేయలేదు?” అని తన భార్యను తిట్టి వెళ్ళిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధురీ విశ్వకర్మ, తన దుపట్టాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తిలక్‌నాయక్, తన భార్య సీలింగ్‌కు వేలాడుతూ ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. రోదిస్తూ.. తన యజమాని దగ్గరకు వెళ్లాడు.. సమాచారం అందుకున్న వెంటనే వెల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం, వారు మాధురి విశ్వకర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త తిట్టడంతో గర్భిణీ స్త్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us