AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒక్కసారిగా దూసుకొచ్చిన రాళ్లు, బురద.. వయనాడులో మరోసారి ప్రకృతి విధ్వంసం.. ఇదిగో వీడియో

కేరళ రాష్ట్రం వయనాడులో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కోజికోడ్ టన్నెల్‌ భారీ కొండచరియ విరిగి పడి సుమారు 4 స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టారు.

Viral Video: ఒక్కసారిగా దూసుకొచ్చిన రాళ్లు, బురద.. వయనాడులో మరోసారి ప్రకృతి విధ్వంసం.. ఇదిగో వీడియో
Wayanad Landslide 2026
Anand T
|

Updated on: Jul 07, 2026 | 5:17 PM

Share

కేరళలోని వయనాడ్‌లో మరోసారి భారీ విపత్తు సంభవించింది. రెండేళ్ల క్రితం కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి సుమారు ఐదు కీలో మీటర్ల దూరంలో ఉన్న మీనాక్షి వంతెన సమీపంలో భారీ కొండచరియ విరిగి పడి ఘోర ప్రమాదం సంభవించింది. భారీగా వచ్చిన మట్టి, శిథిలాల ప్రవాహంలో ఒక ట్యాంకర్ లారీతో సహా పలు వాహనాలు చూస్తుండగానే కొట్టుకుపోయాయి. అలాగే ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 4వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. మరి కొందరు గాయపడగా.. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

బాధితులలో ఎక్కువ మంది వయనాడ్ – కోజికోడ్ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులేనని తెలుస్తోంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవలే టన్నెల్ నిర్మాణ పనులు నిలిపివేయబడటంతో, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎక్కువ మంది కార్మికులు లేరు. దీనివల్ల ప్రమాద తీవ్రత కూడా చాలా వరకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

ప్రమాదానికి సంబంధించిన వీడియో చూడండి..

ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై సీఎం వి.డి. సతీశన్ స్పందిస్తూ.. స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వంతెన నిర్మాణ స్థలంలో ఉన్న భారీ మట్టి కుప్పలను తక్షణమే తొలగించాలని జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ సంస్థ జూన్ 20నే ఆదేశాలు జారీ చేసిందని. కానీ, టన్నెల్ నిర్మాణ కాంట్రాక్టర్లు ఆ ఆదేశాలను పాటించలేదని ప్రాథమిక సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us