AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్ సైడ్ బండి మీద అమ్మే కరకరలాడే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా 10 నిమిషాల్లో చేసేయండి

Challa Punugulu Recipe: పుల్లటి మజ్జిగ, మైదా పిండితో తయారయ్యే చల్ల పునుగులు సాయంత్రం వేళకు అద్భుతమైన అల్పాహారం. మసాలాలు కలిపిన పిండిని కొద్దిసేపు నానబెట్టి బంగారు రంగులో వేయిస్తే బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటాయి. పల్చటి కారంచట్నీతో వడ్డిస్తే రోడ్‌సైడ్ బండి రుచి ఇంట్లోనే ఆస్వాదించవచ్చు..

Srilakshmi C
|

Updated on: Jul 07, 2026 | 4:59 PM

Share
సాయంత్రం వేళ వేడి వేడి చల్ల పునుగులు తినాలని అనిపిస్తే, బండి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే రుచికరమైన చల్ల పునుగులను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పుల్లటి పెరుగుతో తయారయ్యే ఈ పునుగులు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి.

1 / 5
చల్ల పునుగులకు కావలసిన పదార్థాలు.. మైదా పిండి – సుమారు 1½ కప్పులు, పెరుగు / చిక్కటి మజ్జిగ – ముప్పావు కప్పు, ఉప్పు – 1 టీ స్పూన్ (రుచికి సరిపడా), జీలకర్ర – 1 టీ స్పూన్, వంట సోడా – చిటికెడు (ఐచ్చికం), పచ్చిమిర్చి ముక్కలు – 2, ఉల్లిపాయ సన్నగా తరిగింది – 1 (ఐచ్చికం), కరివేపాకు తరిగింది – 1 టేబుల్ స్పూన్, నీరు – అవసరమైనంత, నూనె – డీప్ ఫ్రైకి.. తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి తీసుకొని అందులో ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. పుల్లటి వేసి చేత్తో బాగా కలపాలి. చాలా గట్టిగా ఉండకూడదు. చాలా పల్చగా ఉండకూడదు. చేత్తో తీసి వదిలితే నెమ్మదిగా పడేంత మందంగా ఉండాలి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు దాన్ని బీట్‌ చేసుకోవాలి. అనంతరం ఈ పిండిని కనీసం 30 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.

3 / 5
ఇలా చేస్తే పిండిలో పులుపు బాగా వస్తుంది. పునుగులు లోపల స్పాంజీగా అవుతాయి. వేయించే ముందు చిటికెడు వంట సోడా వేసి మెల్లగా కలపాలి. ఆ తర్వాత కడాయిలో నూనె వేడి చేయాలి. మంటను మధ్యస్థాయిలో ఉంచాలి. చేతిని తడిపి చిన్న చిన్న ఉండలుగా పిండిని నూనెలోకి వేయాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదు. అన్ని వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. టిష్యూపేపర్‌పై తీసి అదనపు నూనె తొలగించాలి. అంతే కమ్మని చల్ల పునుగులు రెడీ అయినట్లే.

4 / 5
పెరుగు పుల్లగా ఉంటే పునుగులు రుచిగా వస్తాయి. పిండిని కనీసం 30 నిమిషాలు ఉంచాలి. నూనె చాలా వేడిగా ఉంటే బయట మాత్రమే వేగి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే మధ్య మంటపై వేయిస్తే లోపల వరకు బాగా ఉడుకుతాయి. వీటిని పల్చగా చేసిన చట్నీతో తింటే బండి దగ్గర దొరికే రుచికి దగ్గరగా ఉంటుంది. ఈ రెసిపీతో సుమారు 25–30 చల్ల పునుగులు తయారు చేయవచ్చు. బంగారు రంగులో బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే పునుగులు వానల్లో వేడిగా తింటే రుచి భలేగా ఉంటుంది.

5 / 5
Follow Us
రోడ్ సైడ్ బండి మీద అమ్మే కరకరలాడే చల్ల పునుగులు.. ఇంట్లోనే చేయండి

రోడ్డుపై వంట నూనె.. బాటిళ్లతో పరుగెత్తిన జనం..

బరువు పెరగాలనుకునే వారికి అమృతం లాంటి జ్యూస్.. రోజుకో గ్లాస్ చాలు

2021లో వచ్చింది.. ఇప్పటికీ ఓటీటీని షేక్ చేస్తుంది..

అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే

ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా..? ఈ తప్పు చేస్తే జైలే.

క్రికెట్ ప్రపంచంలో సూర్యకుమార్ యాదవ్ లేటెస్ట్ పోస్ట్ కలకలం

నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర