AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ

Mekapothu Mambhiryam Story: చాలాసార్లు మనం తెలియని విషయాలను చూసి భయపడతాం. వాస్తవాలను తెలుసుకోకుండా నిర్ణయాలకు రావడం మంచిది కాదు. అవగాహన లేకపోవడం వల్ల భయం ఏ విధంగా కలుగుతుందో? తెలివితో ప్రమాదాలను ఎలా తప్పించుకోవచ్చో? ఈ కింది కథ భలేగా చెబుతుంది. పిల్లలకు ఇటువంటి కథలు చెబితే వారు పరిస్థితులను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో చిన్నతనం నుంచే నేర్చుకుంటారు..

Moral Story: ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
Mekapothu Gambhiryam Story
Srilakshmi C
|

Updated on: Jul 07, 2026 | 7:20 PM

Share

ఒక గ్రామానికి చెందిన మేకల కాపరి ప్రతిరోజూ తన మేకల మందను అడవికి మేతకు తీసుకెళ్లేవాడు. ఒక రోజు కూడా అలాగే మేకలన్నీ అడవిలో మేస్తుండగా, ఒక మేకపోతు గడ్డి కోసం అటూ ఇటూ తిరుగుతూ మందకు దూరమైంది. సాయంత్రం కావడంతో మిగతా మేకలన్నీ కాపరితో కలిసి గ్రామానికి బయలుదేరాయి. కానీ ఆ మేకపోతు మాత్రం అడవిలోనే తప్పిపోయింది. మందను వెతుకుతూ అది అడవంతా తిరిగింది. ఎంత వెతికినా తన స్నేహితులు కనిపించలేదు. క్రమంగా చీకటి పడింది. అడవిలో క్రూరమృగాల అరుపులు వినిపించసాగాయి. భయంతో వణికిపోయిన మేకపోతు ఎక్కడైనా రాత్రికి ఆశ్రయం దొరికితే బాగుంటుందని అనుకుంది.

అలా తిరుగుతూ ఉండగా ఒక కొండగుహ కనిపించింది. ‘ఇక్కడ రాత్రంతా గడిపితే ఉదయం వెలుగు వచ్చిన తర్వాత దారి వెతుక్కోవచ్చు’ అని భావించి ఆ గుహలోకి వెళ్లి ఒక మూలన పడుకుంది. అయితే తెలియని విషయం ఏమిటంటే, ఆ గుహ ఒక సింహం నివాసం. కొంతసేపటి తర్వాత వేట ముగించుకుని సింహం తన గుహ వద్దకు వచ్చింది. లోపలికి వెళ్లబోతూ చీకట్లో రెండు మెరిసే కళ్లు కనిపించాయి. దగ్గరగా చూసిన సింహానికి పెద్ద గడ్డం, పదునైన కొమ్ములు ఉన్న వింత జంతువు కనిపించింది. ఇంతవరకు అలాంటి జంతువును చూడని సింహం ఒక్కసారిగా భయపడిపోయి గజగజ వణికింది.

‘ఇది ఏ జంతువో! నా గుహలోకి వచ్చి పడుకుంది. నన్ను చంపడానికి వచ్చిందేమో!’ అని అనుకుంది. ధైర్యం చేయలేక గుహ బయటే నిలబడి పోయింది. ఇక మేకపోతు పరిస్థితి కూడా అంతే. సింహాన్ని చూసిన వెంటనే దాని గుండె బలంగా కొట్టుకుంది. ‘అయ్యో! ఇది సింహం. ఇప్పుడే నన్ను తినేస్తుంది’ అని అనుకుంది. కానీ ఆశ్చర్యకరంగా సింహం లోపలికి రాకుండా బయటే నిలబడి ఉండటం గమనించింది. ‘సింహం కూడా నన్ను చూసి భయపడుతోంది. నేను భయపడుతున్నట్లు కనిపిస్తే ప్రాణాలు పోతాయి. ధైర్యంగా నటిస్తే తప్పించుకునే అవకాశం ఉంటుంది’ అని మేకపోతు నిర్ణయించుకుంది.

ఇవి కూడా చదవండి

రాత్రంతా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ భయపడుతూనే ఉన్నారు. సింహం లోపలికి రాలేదు. మేకపోతు బయటికి వెళ్లలేదు. తెల్లవారుజామున కొద్దిగా వెలుగు రావడంతో మేకపోతు తన భయాన్ని దాచుకుని గుహ బయటకు వచ్చింది. సింహం ఇంకా అక్కడే ఉంది. వెంటనే గంభీరంగా గద్దిస్తూ, ‘ఎవరు నువ్వు?’ అని అడిగింది.సింహం వణుకుతూ ‘నేను సింహం.. అడవికి రాజును..’ అని చెప్పింది. అప్పుడు మేకపోతు మరింత ధైర్యంగా నటిస్తూ, ‘ఓహో! నువ్వేనా ఆ సింహం? నిన్నే నేను వెతుకుతున్నాను. ఇప్పటివరకు వెయ్యి ఏనుగులను, లెక్కలేనన్ని పులులను చంపాను. సింహాన్ని చంపే వరకు ఈ గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఇన్నాళ్లకు నువ్వు దొరికావు. నిన్ను చంపి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను!’ అని గట్టిగా అరిచింది. అంతేకాక రెండు కాళ్లు పైకెత్తి ఒక్కసారిగా సింహం వైపు దూకింది.

ఇది చూసిన సింహం ప్రాణభయంతో వణికిపోయింది. ‘ఇంత భయంకరమైన జంతువు నా మీదకు దూకుతోంది!’ అని అనుకుని వెనుదిరిగి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పరుగెత్తింది. వెనక్కి తిరిగి కూడా చూడలేదు. సింహం పారిపోవడం చూసిన మేకపోతు ఊపిరి పీల్చుకుంది. ‘ధైర్యమే నన్ను కాపాడింది’ అని భావించింది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అడవిలో తన మందను వెతికింది. కొంతసేపటికి మిగతా మేకలను కనుగొని వాటితో కలిసి సురక్షితంగా గ్రామానికి చేరుకుంది.

ఆపదలో భయపడకుండా తెలివిగా వ్యవహరించడమే ఈ కథ నీతి

ఆపద సమయంలో భయపడకుండా ధైర్యంగా ఆలోచిస్తే పెద్ద ప్రమాదాలనైనా తప్పించుకోవచ్చు. సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం మనకు గొప్ప ఆయుధాలు. ఈ కథ మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ఆపదలు ఎదురైనప్పుడు భయానికి లోనవకుండా ధైర్యంగా ఆలోచించడం చాలా ముఖ్యం. శారీరక బలం లేకపోయినా, సమయస్ఫూర్తి, తెలివితేటలతో పెద్ద పెద్ద ప్రమాదాలను కూడా అధిగమించవచ్చు. ఈ కింది కథలో మేకపోతు సింహం కంటే బలహీనమైనదే అయినప్పటికీ.. తన ధైర్యం, చాకచక్యంతో ప్రాణాలను కాపాడుకోగలిగింది. అదేవిధంగా ‘సమయస్ఫూర్తితో కూడిన ధైర్యం ప్రాణాలను కాపాడుతుంది. తెలివి ముందు బలం కూడా తలవంచుతుంది’ అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.

Follow Us
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
Jr NTRతో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
Jr NTRతో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో