A, B, Cల్లో దొంగ వెళ్లిన దారేది? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న
ఓ దొంగతనం కేసును డిటెక్టివ్ తన పరిశీలన శక్తి, తార్కిక ఆలోచనతో ఛేదిస్తాడు. దొంగ దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ కాలిముద్రలు సృష్టించినప్పటికీ, అడవిలోని చెట్ల ఆకులు, కొమ్మలు రాలిపడిన అసలు దారిని గుర్తించిన డిటెక్టివ్ నిజమైన ఆధారాలను కనుగొంటాడు. చివరకు దొంగ చేసిన చిన్న పొరపాటే అతని నేరాన్ని బయటపెడుతుంది. ఈ Detective IQ కథ మనకు ఒక ముఖ్యమైన నీతిని తెలియజేస్తుంది. ఎంత తెలివిగా నేరం చేసినా, నిజమైన ఆధారాలను పూర్తిగా దాచడం సాధ్యం కాదు. పరిశీలన శక్తి, సహనం, తార్కిక ఆలోచన ఉంటే ఏ సమస్యకైనా సరైన పరిష్కారం కనుగొనవచ్చు. నిజం కొంతకాలం దాగి ఉన్నా, చివరికి తప్పకుండా వెలుగులోకి వస్తుంది..

ఒక రిసార్ట్‌లో రాత్రి సమయంలో దొంగతనం జరుగుతుంది. దొంగ విలువైన డైమండ్ నక్లిస్ తీసుకుని రిసార్ట్ వెనుక ఉన్న అడవి వైపు పారిపోతాడు. మరుసటి రోజు రిసార్ట్ యాజమాన్యం ఈ విషయాన్ని గుర్తించి, కేసును ఛేదించడానికి డిటెక్టివ్‌ను పిలుస్తుంది. దర్యాప్తు ప్రారంభించిన డిటెక్టివ్‌కు రిసార్ట్‌లో ఉన్న కొంతమంది వ్యక్తులను విచారించినా, ఎవరు దొంగతనం చేశారో స్పష్టంగా తెలియదు. సంఘటన జరిగిన సమయంలో తాము వేర్వేరు దారుల్లో నడిచామని చెబుతూ తమకు సంబంధం లేదని వాదిస్తారు.
దర్యాప్తు కోసం డిటెక్టివ్ అక్కడికి చేరుకుంటాడు. సంఘటన జరిగిన సమయంలో అనుమానితులు తాము వేర్వేరు మార్గాల్లో వెళ్లామని చెబుతారు. సంఘటన స్థలానికి సమీపంలోని అడవిలో మూడు వేర్వేరు దారులు (A, B, C) కనిపిస్తాయి. వాటిపై ఉన్న కాలిముద్రలు, అడుగుజాడలు, పరిసర ఆధారాలను డిటెక్టివ్ పరిశీలిస్తాడు. ప్రతి దారిలోనూ కాలిముద్రలు కనిపిస్తాయి. మొదట చూసినప్పుడు అన్ని దారులూ ఒకేలా అనిపించినా, డిటెక్టివ్ ప్రతి అడుగుజాడను జాగ్రత్తగా గమనిస్తాడు. కొన్ని కాలిముద్రలు సహజంగా పడినట్లు లేవు. ఒక దారిలో అడుగుల మధ్య దూరం అసాధారణంగా ఉంటుంది. మరికొన్ని ముద్రల్లో శరీర బరువు పడిన లోతు కనిపించదు. నిజంగా నడిచిన వ్యక్తి ముద్రలు ఒక విధంగా ఉంటే, కృత్రిమంగా సృష్టించిన ముద్రలు మరో విధంగా ఉంటాయి. అక్కడ ఉన్న దారుల్లో రెండూ నకిలీవని డిటెక్టివ్ అర్ధం చేసుకుంటాడు. ఒక దారిలో మాత్రం దొంగ నడచినట్లు డిటిక్టివ్ గుర్తిస్తాడు. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అనుమానితుడు కావాలనే తప్పుడు కాలిముద్రలు సృష్టించి దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని డిటెక్టివ్ గుర్తిస్తాడు. అయితే అతడు చేసిన చిన్న పొరపాటు వల్ల అసలు నిజం బయటపడుతుంది.
A, B, C.. ఆ దారిలో క్లూ
A మార్గంలో స్పష్టమైన మానవ అడుగుజాడలు కనిపించడం లేదు. B మార్గంలో ఉన్న గుర్తులు మానవ చెప్పుల ముద్రల్లా కాకుండా జంతువుల జాడలు లేదా అస్పష్టమైన గుర్తుల్లా కనిపిస్తున్నాయి. C మార్గంలో మాత్రం చెప్పులు వేసుకున్న వ్యక్తి నడిచినట్లుగా వరుసగా అడుగుజాడలు కనిపిస్తున్నాయి. పైగా చెట్ల ఆకులు నేలపై రాలి కనిపించాయి. అందువల్ల దొంగ పారిపోయిన దారి C అని డిటెక్టివ్ నిర్ధారిస్తాడు. అలా A, B దారులు రెండూ నకిలీవని డిటెక్టివ్ అర్ధం చేసుకుంటాడు. అయితే C దారిలో మాత్రం దొంగ నడచినంత దూరం అడవిలోని చెట్ల ఆకులు, కొమ్మలు కింద రాలిపడి ఉండటం డిటిక్టివ్ కంట పడుతుంది. చివరికి డిటెక్టివ్ అందరి ముందూ తన విశ్లేషణను వివరిస్తాడు. కాలిముద్రలలోని అసహజ లక్షణాలను చూపించి అసలు దొంగ ఎవరో నిరూపిస్తాడు. దీంతో దొంగ తన నేరాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. కేసు సులువుగా ఛేదించబడుతుంది. దొంగ తనను ఎవరూ గుర్తించరని భావించినా, నేలపై మిగిలిన చెప్పుల ముద్రలు అతనిని పట్టించాయి. డిటెక్టివ్ ఆ ముద్రలను అనుమానితుడి చెప్పులతో పోల్చి కేసును ఛేదిస్తాడు.
నిజానికి ఇదొక Detective IQ టెస్ట్. నేరస్థుడు ఎంత తెలివిగా ఆధారాలను దాచినా, చిన్న పొరపాటు అతన్ని బయటపెడుతుంది. పరిశీలన శక్తి, తార్కిక ఆలోచన ముందు నిజం దాగదు.
